ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలని మూడు రాజధానులు నడిపిస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతిలో లెజిస్లేటివ్, కర్నూలులో జ్యూడిషయల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్స్ ఏర్పాటు చేయాలని ఫిక్స్ అయితే, టీడీపీ మాత్రం అమరావతిలోనే మొత్తం రాజధాని ఉంచాలని డిమాండ్ చేస్తూ రోడ్లెక్కి హడావిడి ఉద్యమం చేస్తుంది. ప్రభుత్వం అభివృద్ధి కోసమని ఈ నిర్ణయాన్ని తీసుకుంటే టీడీపీ మాత్రం ఓ ప్రాంతంలో రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

 

అయితే టీడీపీ అనుకున్న మాదిరిగా రాజకీయ లబ్ది విషయానికొస్తే...వైసీపీకే ఎక్కువ బెనిఫిట్ వస్తుందని రాష్ట్రమంతా చర్చలు నడుస్తున్నాయి. ఇదే సమయంలో త్వరలో రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో వైసీపీనే భారీగా స్థానాలు గెలుస్తుందని అంటున్నారు. అయితే లోకల్ బాడీలో పార్టీ సత్తా తేలేది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనే. ముఖ్యంగా పార్టీలు కైవసం చేసుకునే జెడ్పీ స్థానాలని బట్టి పరిస్తితి అర్ధమవుతుంది.

 

మన రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి కాబట్టి...13 జెడ్పీ పీఠాలు ఉన్నాయి. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆపార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే మూడు రాజధానులు వల్ల కూడా వైసీపీకి మరింత మెజారిటీ వచ్చే అవకాశముంది. ఇదే సమయంలో రెండు మూడు చోట్ల వైసీపీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం కూడా ఉందని విశ్లేషణలు బయటకొస్తున్నాయి. రాజకీయ విశ్లేషుకుల లెక్కల ప్రకారం ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం స్థానాలు వైసీపీ ఖాతాలో పడటం పక్కా అంటున్నారు.

 

అదేవిధంగా రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం స్థానాలు కూడా వైసీపీ గెలుచుకోనుంది. ఇక ఉత్తరాంధ్ర పక్కన ఉన్న తూర్పుగోదావరి, రాయలసీమ పక్కన ఉన్న నెల్లూరు జెడ్పీ స్థానాల్లో వైసీపీదే విజయమంటున్నారు. అయితే అమరావతికి అటు ఇటు ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని అంటున్నారు. అక్కడ టీడీపీకి అడ్వాంటేజ్ ఉందని చెబుతున్నా..అధికారం వైసీపీది కాబట్టి అప్పుడు పరిస్తితులు మారోచ్చు. ఇక ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో హోరాహోరీ పోరు జరిగిన చివరిగా వైసీపీనే గెలుస్తుందని చెబుతున్నారు. మరి చూడాలి 13 జెడ్పీల్లో వైసీపీకి ఎక్కడ ఎదురుదెబ్బ తగులుతుందో?  

మరింత సమాచారం తెలుసుకోండి: