తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడి జీవించే ఆ రైతుకు మొత్తం ఐదుగురు పిల్లలు. తాను వ్యవసాయం చేసి ఎంతో కష్టపడుతున్నానని తన పిల్లలు తనలా కష్టపడకూడని ఆ తండ్రి పిల్లలను ఉన్నత చదువులు చదివించాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఆ ఇబ్బందులను అధిగమించి మరీ పిల్లలు ఉన్నత చదువులు చదవడానికి కృషి చేశాడు. తన తండ్రి తమకోసం ఎంతో కష్టపడుతున్నాడని గ్రహించి పిల్లలు కూడా తండ్రి కల నిజం చేయడానికి కష్టపడి చదివారు. 
 
ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి తండ్రి కలలను నెరవేర్చి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ఐదుగురు పిల్లలలో ఒకరు అమెరికా స్థిరపడగా మిగతా నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. పూర్తి వివరాలలోకి వెళితే కాకుమాను మంగిరెడ్డి, లక్ష్మి దంపతులు ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండలం పెదమండవ గ్రామంలో వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్నారు. 
 
ఈ దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మూడో కుమార్తె శిరిష అమెరికాలో ఫార్మా రంగంలో స్థిరపడగా మిగతా నలుగురికీ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పెద్ద కుమార్తె నాగమణి ఉద్యోగం సాధించగా రెండో కుమార్తె జానకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఉత్తీర్ణురాలైంది. నాలుగో కూతురు మనోజ బ్యాంకు ఉద్యోగం సాధించగా కుమారుడు ప్రవీణ్ కూడా బ్యాంకు ఉద్యోగం సాధించాడు. 
 
పిల్లలందరూ ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడటంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తాము కన్న కలలను తమ పిల్లలు సాకారం చేశారని తల్లిదండ్రులు చెబుతున్నారు. పట్టుదలతో తమ పిల్లలందరూ అనుకున్న లక్ష్యాలను సాధించారని తమ కోరికలను నెరవేర్చారని చెబుతున్నారు. రెండో కుమార్తె జానకి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో హెల్త్ ఇన్ స్పెక్టర్ ఫలితాల్లో రెండవ ర్యాంకు, శానిటరీ ఇన్ స్పెక్టర్ ఫలితాల్లో 8వ ర్యాంకు వచ్చిందని చెప్పారు. రెండు ఫలితాల్లో మహిళా విభాగంలో ప్రథమ ర్యాంకు వచ్చిందని తెలిపారు. తల్లిదండ్రులు, భర్త ప్రోత్సాహంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించానని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: