సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ.. ఇటీవల జనసేన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ లేరు. కానీ.. ఆయన తాజా వ్యాఖ్యలను చూస్తే.. బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. విజయవాడలో ఓ కళాశాల కార్యక్రమానికి హాజరైన ఆయన బీజేపీ పరిపాలన అద్భుతం అంటూ ఆకాశానికి ఎత్తేశారు. వివాదాస్పదంగా మారిన ఎన్నారీ, సీఏఏ చట్టాలను కూడా ఆయన ప్రశంసలతో ముంచెత్తారు.

 

అస్సాంలో శరణార్థుల సమస్య పరిష్కారం కోసమే NRC తీసుకువచ్చారని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఎన్ ఆర్ సీ , సీఎఎ చట్టాల గురించి అపోహలు వస్తోన్న పరిస్ధితుల్లో యువత వీటి గురించి సమగ్రంగా తెలుసుకోవాలని సూచించారు. విజయవాడ లోని నోవాటెల్ హోటల్ లో షో టైం కనెక్టింగ్ విత్ గ్రేట్ మైండ్స్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థుల అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తెలిపారు.

 

భారత దేశం ధర్మశాల కాదని .. దేశ అంతర్గత భద్రత చాలా ముఖ్యమని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రతి ఒక్కరూ సిటిజన్ షిప్ ను నిరూపించుకోవడంలో తప్పులేదన్నారు సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ. దీనికోసం సర్వే కోసం వచ్చిన వారికి తగిన నివాస ద్రువపత్రాలు చూపిస్తే సరిపోతుందన్నారు. సత్ ప్రవర్తన, క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, పనిచేసే తత్వాన్ని అలవర్చుకుంటే ఉన్నత స్థానానికి చేరవచ్చని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.

 

ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చి మన దేశంలో ఉన్న శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడమే చట్టాల ఉద్దేశమని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ వివరించారు. వెస్టిన్ గ్రూపు కళాశాలల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బొబ్బ ఏవియేషన్ సంస్థల ఎండీ వీర స్వామినాథన్ బొబ్బ సహా పలువురు ప్రముఖులు, పలు కళాశాలల విద్యార్థులు హాజరయ్యారు. ఈ మాటలు చూస్తుంటే జేడీ బీజేపీలో చేరే రోజులు దగ్గరలోనే ఉన్నట్టు కనిపిస్తోంది కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: