కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పితో బాధ పడుతున్న సోనియాను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రికి తరలించారు. సోనియా గాంధీకి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా తల్లి వెంట ఆసుపత్రికి వెళ్లారు.

 

సోనియా గాంధీకి ఇటీవల తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇటీవల తరచుగా కడుపునొప్పితో సతమతమవుతున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలోనూ లోక్ సభకు సోనియా హాజరు కాలేకపోయారు. సోనియా కొన్నిరోజులుగా జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతోనూ బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోనియా అస్వస్థతకు గురవడంతో ఆమెను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

 

కొన్నిరోజులుగా ఆమె ఆరోగ్యం నిలకడగా లేదని, వైద్య పరీక్షల కోసమే సోనియా ఆసుపత్రికి వెళ్లినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సోనియా గంగారామ్ ఆసుపత్రిలో చేరారన్న సమాచారంతో కాంగ్రెస్ నేతలు పరామర్శల కోసం బారులు తీరారు. ఈ తాజాగా వార్తలతో అధినేత్రి అలిసిపోయారా..? ఇక యువరాజే పార్టీకి సర్వస్వమా ? అన్న అనుమానాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి.

 

అధినేత్రి అనారోగ్యం కారణంగా పార్టీ పగ్గాలు చేపట్టిన రాహుల్ గాంధీ పార్టీని తనదైన ముద్రతో ముందుకునడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. కుటుంబ పార్టీగా వారసత్వ రాజకీయాలకు ప్రతీకగా నిలిచిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వింత పోకడ కనిపిస్తోంది. గతంలో మోతీలాల్ నెహ్రూ నుంచి ఇందిరా ఇందిరా గాంధీ స్ధానంలో రాజీవ్, ఆయన మరణం తర్వాత సోనియా ఇలా వారసులు పార్టీ పగ్గాలు చేపడుతూ వచ్చినా అప్పట్లో పార్టీ ప్రచార చిత్రాల్లో వారితో పాటు సీనియర్ల ఫోటోలూ దర్శనమిచ్చేవి.

 

 

అయితే ఇందుకు భిన్నంగా ఇప్పుడు టీవీ ఛానెళ్లు, వార్తా పత్రికల్లో వస్తున్న పార్టీ ప్రచారచిత్రాల్లో సోనియా ఫోటో ఎక్కడా కనిపించడం లేదు. మరి ఇప్పటికీ తనను తాను నిరూపించుకోలేని రాహుల్ కాంగ్రెస్ ను ఎలా ముందుకు నడిపిస్తారో..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: