ఏపీ సీఎం జగన్ ఎప్పుడైతే రాష్ట్ర అభివృద్ధి కోసమని మూడు రాజధానుల కాన్సెప్ట్‌ని తెరపైకి తీసుకొచ్చారో..అప్పటి నుంచి అమరావతిలోనే మొత్తం రాజధాని ఉండాలని టీడీపీతో సహ పలువురు రియల్ ఎస్టేట్ వాళ్ళు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అసలు ఎప్పుడు బయటకు రానివారు సైతం అమరావతి కోసమన్నట్లు రోడ్లు మీదకొచ్చి హడావిడి చేస్తున్నారు. అలాగే అమరావతి ప్రాంతానికి వెళ్ళి అక్కడి రైతులకు సంఘీభావం తెలుపుతున్నట్లు చెబుతున్నారు.

 

అయితే అలా ఎప్పుడు బయటకు రాని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా..ఇప్పుడు బయటకొచ్చి అమరావతి ప్రాంత రైతులకు మద్ధతు తెలిపారు. పైగా రాజధానిని అమరావతి నుంచి తరలింపు ప్రక్రియను బీజేపీ అడ్డుకుంటుందని, పరిపాలన అంతా ఒకే ప్రాంతం నుంచి జరగాలని డిమాండ్ చేశారు. త్వరలో రాజధాని రైతులతో కలసి ఢిల్లీకి వెళ్ళి,  కేంద్ర పెద్దలను కలసి రాజధాని అమరావతి ఆవశ్యకతను గురించి వివరిస్తామని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణచేయవచ్చు గాని, పాలనా వికేంద్రీకరణ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

 

ఇప్పుడు ఇలా వచ్చి మూడు రాజధానులని బీజేపీ అడ్డుకుంటుందని చెప్పిన కామినేని, ఏ పార్టీలో ఉన్నారో కూడా ఎవరికి అర్ధం కాకుండా ఉంది. అసలు ఈయన 2009లో ప్రజారాజ్యం తరుపున కైకలూరులో పోటీ చేసి ఓడిపోయి, 2014లో బీజేపీ తరుపున టీడీపీ పొత్తులో భాగంగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక అప్పుడు పొత్తులో భాగంగా చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 4 సంవత్సరాల తర్వాత పొత్తు పెటాకులు కావడంతో, పదవికి రాజీనామా చేసి, బీజేపీలోనే ఉంటూ టీడీపీతో సత్సంబంధాలు నడిపారు.

 

2019లో ఓటమి ఖాయమని ఫిక్స్ అయ్యి, పోటీకి దూరంగా ఉండిపోయారు. అలా అని బీజేపీలో కూడా యాక్టివ్‌గా లేరు. ఇక అప్పటి నుంచి అడ్రస్ లేని కామినేని ఇప్పుడు సడన్‌గా వచ్చి అమరావతిలో తేలి, మూడు రాజధానులని అడ్డుకుంటానని శపథలు చేస్తున్నారు. అసలు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియని ఈయన..ఇప్పుడు ఢిల్లీలో ఏదో చేసేస్తా అంటూ హడావిడి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: