ఒకప్పుడు గుడివాడ పేరు చెబితే...టీడీపీ పేరు గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు కొడాలి నాని పేరు గుర్తొస్తుంది. నాలుగుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలవడంతో గుడివాడ నాని అడ్డాగా మారిపోయింది. అయితే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నాని అధికారంలో లేకుండా ఉన్నారు. ఇక ఇప్పుడు అధికారంలో ఉండటమే కాకుండా మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. దీంతో గుడివాడలో మరింత అభివృద్ధి జరిగి...నానికి ఇంకా ఫేవర్‌గా మారనుంది.

 

కాకపోతే జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులు వల్ల గుడివాడలో కొడాలికి కాస్త ఇబ్బందికర పరిస్తితులు రావోచ్చని టీడీపీ వాళ్ళు ఓ ప్రచారం చేసేస్తున్నారు. రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో కొడాలికి ఎదురుదెబ్బ తగులుతుందని ఓ హడావిడి చేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులని చూస్తే మాత్రం అలా ఏమి లేదు. రాష్ట్రంలో పరిస్తితులు ఎలా ఉన్న గుడివాడ ప్రజలు మాత్రం నానికే ఫేవర్‌గా ఉంటారు. ఎలాంటి పరిస్తితి అయిన తమకు ఎప్పుడు అండగా ఉంటాడని నానికి జనం జై కొడతారు.

 

అయితే మూడు రాజధానుల ఎఫెక్ట్ ఏ మాత్రం పడదని రానున్న స్థానిక సంస్థ ఎన్నికలు స్పష్టంగా చెబుతాయి. నియోజకవర్గంలోని మెజారిటీ పంచాయితీలో వైసీపీ ఖాతాలోనే పడతాయని అర్ధమైపోతుంది. అలాగే గుడివాడ మున్సిపాలిటీ పక్కాగా వైసీపీనే గెలవడం ఖాయమంటున్నారు. 2014లోనే గుడివాడ వైసీపీ గెలుచుకుంది. గుడివాడ మున్సిపాల్టీలో 36 వార్డులకు గాను 21 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ గెలిస్తే, టీడీపీ  కేవలం 15 వార్డుల్లో గెలిచింది.

 

ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గుడివాడ నియోజక వర్గంలో గుడివాడ రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో 37ఎంపీటీసీ స్థానాలు, మూడు జెడ్పీటీసీ స్థానాలు ఉండగా 22 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ జెండా ఎగుర వేసింది. 15 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. మూడు జెడ్పీటీసీ స్థానాలకు గానూ గుడివాడ రూరల్, నందివాడ మండలాల్లో వైసీపీ అభ్యర్థులు గెలువగా గుడ్లవల్లేరు మండలంలో మాత్రం టీడీపీ అభ్యర్థి గెలుపొందారు.

 

అయితే ఈ సారి రిజల్ట్స్ మరింతగా మారనున్నాయని తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ కోల్పోయిన గుడ్లవల్లేరు కూడా ఇప్పుడు గెలవనుందని తెలుస్తోంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓట్లలో కొడాలికి గుడ్లవల్లేరులో 900 ఓట్ల మెజారిటీ వచ్చింది. దీని బట్టి చూసుకుంటే గుడ్లవల్లేరు కూడా వైసీపీ ఖాతాలోకి వస్తుంది. అటు రూరల్, నందివాడలు ఎలాగో వైసీపీ కంచుకోటలు కాబట్టి లోకల్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: