రాజశ్యామల దేవి.. ఈ పేరు విన్నారా.. గత ఎన్నికల ముందు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఈ రాజశ్యామల దేవి యాగం చేశారు.. ఇప్పుడు విశాఖ పట్నంలో ఏపీ సీఎం జగన్ రాజశ్యామల దేవి పూజలో పాల్గొన్నారు. ఇలా ఈ అమ్మవారి పేరు తరచూ వార్తల్లో వినిపిస్తోంది.

 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నంలోని చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠంలో ఈ అమ్మవారి పూజ చేశారు. శారదాపీఠం వార్షిక మహోత్సవ ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన సీఎం జగన్‌... శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్న అనంతరం.. స్వామీజీలు స్వరూపానందేంద్ర, స్వాత్మానందరేంద్రతో కలిసి పీఠం ప్రాంగణంలోని రాజశ్యామల అమ్మవారికి పూజలు చేశారు.

 

ఈ రాజశ్యామల దేవి పూజలు, యాగాలు చేస్తే అధికారం దక్కుతుందట. ఇప్పటికే అధికారంలో ఉంటే అది సుస్థిరం అవుతుందట. గత ఎన్నికల ముందు కేసీఆర్ ఈ యాగం చేశారు. యాగ ఫలితమో ఏమో కానీ ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చారు. జగన్ కూడా ఎన్నికల ముందు ఈ దేవి పూజ చేసినట్టు చెబుతారు. ఏదేమైనా ఈ అమ్మ వారి అనుగ్రహం అధికార ప్రాప్తికి దోహదపడుతుందన్నమాట

 

ఇక జగన్ సోమవారం ఈ రాజశ్యామల అమ్మవారి పూజ తర్వాత.. ఆ తర్వాత గోమాతకు నైవేద్యం సమర్పించి జమ్మిచెట్టు ప్రదక్షిణ చేశారు. ఆగమ యాగశాలలో ఐదు రోజులుగా జరుగుతునన శ్రీనివాస చతుర్వేద హవనం, విశ్వశాంతి హోమాలను సందర్శిస్తారు. మహాపూర్ణాహుతిలో పాల్గొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: