తూర్పు గోదావరి...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక నియోజకవర్గాలు కలిగిన జిల్లా. మొత్తం 19 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఏ పార్టీ అయిన అధికారంలోకి రావాలంటే ఈ జిల్లానే ఎక్కువ డిసైడ్ చేస్తుంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు అదే జరిగింది. మొన్న 2019 ఎన్నికల్లో వైసీపీకి మెజారిటీ సీట్లు ఇచ్చింది. మొన్న ఎన్నికల్లో వైసీపీ 13 సీట్లు, 3 ఎంపీ స్థానాలని గెలుచుకుంటే, టీడీపీ 4, జనసేన రాజోలు స్థానాలని గెలుచుకుంది.  

 

అయితే ఆ ఎన్నికల్లో జనసేన కాస్త గట్టి ప్రభావం చూపిన జిల్లా ఇదే. ఆ పార్టీ ఓట్లు చీల్చడం వల్ల టీడీపీకి చాలా చోట్ల బొక్కపడి, వైసీపీ విజయం అందుకుంది. ఒకవేళ ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే కాస్త పరిస్తితి వేరుగా ఉండేది. ఇక ఇప్పుడు స్థానిక ఎన్నికలు రానుండటంతో టీడీపీ శ్రేణుల్లో మళ్ళీ భయం పట్టుకుంది. పైగా బీజేపీ-జనసేనలు కలిసి రావడంతో టీడీపీకి గట్టి దెబ్బే తగులుతుందని అంటున్నారు. మామూలుగానే జనసేనకి జిల్లాలో చెప్పుకోదగ్గ బలమే ఉంది.

 

అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ పలు నియోజకవర్గాల్లో 20 వేలకు పైనే ఓట్లు తెచ్చుకుంది. ఇక బీజేపీకి రాష్ట్రంతో పోలిస్తే ఇక్కడ కొంచెం ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయి కాబట్టి స్థానిక ఎన్నికల్లో కొంచెం పోటీ ఇవ్వగలరు. కాకపోతే వీరికి పూర్తిగా గెలిచెంత సీన్ ఉండదు. అలాగే టీడీపీ గెలిచే స్థానాల్లో ఓట్లు చీల్చి, ఆపార్టీ కొంపముంచుతుంది. ఎప్పుడైతే టీడీపీకి దెబ్బపడుతుందో, ఆటోమేటిక్‌గా అధికార వైసీపీకి ప్లస్ అవుతుంది.

 

అనుకున్న స్థాయి కంటే వైసీపీ మున్సిపాలిటీలు, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి, పంచాయితీ స్థానాలని గెలిచే ఛాన్స్ ఉంటుంది. అలాగే రాజమండ్రి, కాకినాడ కార్పొరేషన్‌ల్లో సత్తా చాటే అవకాశం ఉంటుంది. ఏదేమైనా బీజేపీ-జనసేనల వల్ల టీడీపీ కొంపమునిగి వైసీపీకి కలిసి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: