సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి గంటన్నర సేపు జగన్ పాలనలో ఏపీ ఎలా వెనుకబడిందో విమర్శించారు కదా.. ఇప్పుడు వైసీపీ దానికి కౌంటర్లు ఇస్తోంది. వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చంద్రబాబుకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. “ నువ్వు పరిపాలిస్తే సింగపూర్, జపాన్‌ అవుతుంది.. మేము పరిపాలిస్తే బిహార్‌లా ఉంటుందా.. చంద్రబాబూ? అంటూ నిలదీశారు.

 

గత ఐదేళ్లలో బాబు కట్టిన సింగపూర్, జపాన్‌ చూడాలంటే అమరావతికి రండి.. అసెంబ్లీలో టాయిలెట్లు కూడా లేవని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. నోరు ఉంది కదా.. మీడియా ఉంది కదా.. అని మాట్లాడొద్దని హెచ్చరించారు. ఆస్తుల రేట్లు ఎక్కడ పడిపోతాయోనని ఏడుపు తప్ప.. ప్రజల మీద చంద్రబాబుకు ప్రేమ లేదన్నారు. సింగపూర్, జపాన్‌ అని మాట్లాడేవారికి ఇక్కడేం పని.. అక్కడికి వెళ్లిపోవచ్చు కదా అని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఎద్దేవా చేశారు.

 

అంతేకాదు.. చంద్రబాబు పాలనకూ జగన్ పాలనకూ తేడాలేంటో చెబుతూ ఘాటుగా ప్రశ్నలు సంధించారు మంత్రి అవంతి శ్రీనివాస్‌.. ఏడు నెలల్లో రాష్ట్రం నాలుగేళ్లు వెనక్కు వెళ్లిపోయిందని చంద్రబాబు అంటున్నాడు. పారదర్శకంగా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు వెనక్కు వెళ్లిందా..? వైయస్‌ఆర్‌ రైతు భరోసా ఇచ్చినందుకు బిహార్‌ కంటే ఘోరమైందా..? 43 లక్షల మందికి అమ్మఒడి పథకం ద్వారా రూ.650 కోట్లు ఇచ్చినందుకు వెనక్కు వెళ్లిపోయిందా..? కుల, మత, ప్రాంతం, చివరకు పార్టీలు కూడా చూడకుండా సీఎం వైయస్‌ జగన్‌ అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఐదేళ్లలో నువ్వు ఒక్క ఇల్లు అయినా ఇచ్చావా చంద్రబాబూ..? అంటూ నిలదీశారు మంత్రి అవంతి శ్రీనివాస్‌.

 

గతంలో జరిగిన పొరపాటు మళ్లీ జరగకుండా ఉండాలంటే అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉంది. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలన్న సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచనను అన్ని జిల్లాలకు తీసుకెళ్లాలని నిర్ణయించామంటూ ముగించారు మంత్రి అవంతి శ్రీనివాస్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: