మరికొన్ని రోజుల్లో చంద్రబాబు అండ్ బ్యాచ్ మళ్ళీ రాజకీయ నిరుద్యోగులుగా మారనున్నారు. ఇన్ని రోజులు అమరావతిని అడ్డం పెట్టుకుని చేస్తున్న రచ్చకు బ్రేక్ పడనుంది. ఒకే ఒక ప్రకటనతో బాబుకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. రాజధాని విషయంతో మాకు సంబంధం లేదని, రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని కాబట్టి ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని లోక్ సభ వేదికగా కేంద్రం ప్రకటించింది. ఇక ఈ దెబ్బకు బాబు బ్యాచ్ తట్టా బుట్టా సర్దేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

 

అయితే ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మారిన విషయం తెలిసిందే. అందుకనే ఏం చేయాలో తోచక బాబు...జగన్ ఏ నిర్ణయం తీసుకున్న దానిపైన రాజకీయం చేయడం మొదలుపెట్టారు. మొదట ఇసుక, ఇంగ్లీష్ మీడియం, ఉల్లిపాయలు ఇలా వరుసగా ప్రతిదానిపై ఏదొక హడావిడి చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే మూడు రాజధానులపై చేస్తున్న రచ్చ అంతాఇంతా కాదు.

 

ప్రజలందరూ ఆమోదం తెలిపిన బాబు మాత్రం, అమరావతినే కావాలంటూ ఉద్యమం చేయడం మొదలుపెట్టారు. కొందరు తనకు అనుకూలమైన వారిని పెట్టుకుని పోలిటికల్ జే‌ఏసిలగా ఏర్పడి, కొన్ని అనుకూల ప్రాంతాలు తిరుగుతూ హడావిడి చేశారు. గత 45 రోజుల నుంచి దీనిపైనే రాజకీయం నడుపుతున్నారు. ఇక దీన్ని మరింతగా పెంచి రాష్ట్రంలో అశాంతి క్రియేట్ చేద్దామనుకున్న బాబుకు కేంద్రం భారీ షాక్ ఇచ్చి, రాజధానితో మాకు సంబంధంలేదని తేల్చి చెప్పింది.

 

ఇదే సమయంలో బాబుకు మరో షాక్ కలిగేలా, కొందరు అమరావతి రైతులు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆధ్వర్యంలో జగన్‌ని కలిశారు. తమ సమస్యలని ఆయనకు వివరించారు. ఇక రైతుల సమస్యలని పరిష్కరించడానికి జగన్ కూడా..అమరావతి అభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకున్న పాలసీని వివరించినట్లు తెలిసింది. అయితే కేంద్రం రాజధానిపై చేతులెత్తేయడం, రైతులతో జగన్ మాట్లాడిన నేపథ్యంలో ఉద్యమం చేస్తున్న అమరావతి ప్రాంత ప్రజలు కాస్త వెనక్కి తగ్గే అవకాశముందని తెలుస్తోంది. మొత్తం మీద అయితే కేంద్రం నిర్ణయంతో అమరావతి ఉద్యమం ముగిసే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: