కొన్ని నెలల క్రితం గోదావరి నదిలో బోటు ప్రమాదం జరిగి దాదాపు 50 మంది వరకూ జల సమాధి అయిన విషయం తెలిసిందే. అప్పుడు మునిగిపోయిన బోటును తీయడానికి చాలా రోజులు సమయం పట్టింది. చివరకు కొందరి మృతదేహాలు కూడా దొరకకుండా కొట్టుకుపోయాయి. ఈ సమయంలో పర్యావరణ శాఖపై విమర్శలు వచ్చాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందన్న విమర్శలు వచ్చాయి.

 

అందుకే ఇప్పుడు జగన్ సర్కారు ఈ బోట్ల విషయంలో ఓ విధాన పరమైన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ప్రకటించారు. పెద్ద బోట్ల అనుమతి కోసం విధి విధానాలు రూపొందించామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఫిబ్రవరి 20 నాటికి తొమ్మిది కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తారట.

 

స్టేట్‌ లెవల్‌లో డిప్యూటీ కలెక్టర్‌ కంట్రోల్‌ రూమ్‌ మానిటర్‌ చేస్తారని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. కంట్రోల్‌ రూమ్‌ పర్మిషన్‌ ఇచ్చిన తర్వాతే పెద్ద బోట్లకు అనుమతులు ఇస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ వివరించారు. మరోవైపు కరోనా వైరస్‌ వ్యాప్తి పైనా మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. ప్రజలకు చైతన్యం కల్పించేందుకు ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని మంత్రి అవంతి తెలిపారు. ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లతో భాగస్వామ్యమై ప్రతి జిల్లాలో అవగాహన ర్యాలీలు చేయాలని నిర్ణయించామన్నారు.

 

వికేంద్రీ కరణ విషయంపై స్పందించిన మంత్రి అవంతి శ్రీనివాస్... అధిక ఆదాయం వచ్చే మహానగరం లాంటి హైదరాబాద్‌ను కోల్పోయిన తరువాత ఆంధ్రరాష్ట్రం చాలా ఇబ్బందులు పడుతుందని, గతంలో జరిగిన పొరపాటు మళ్లీ జరగకూడదు అంటే అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలన్నారు. రాయలసీమ జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా.లు. ఆర్థికంగా, అభివృద్ధి పరంగా, రాజకీయంగా ఈ మూడు ప్రాంతాలు వెనుకబాటుకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: