వెల్లూరి క్రాంతి... దేశంలో చిన్న వయస్సులో ఐఏఎస్ సాధించిన వారిలో ఈమె కూడా ఒకరు. కేవలం 24 ఏళ్లకే క్రాంతి తన లక్ష్యాన్ని సాధించారు. రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన లక్ష్మమ్మ, రంగారెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు నీలిమ, క్రాంతి. లక్ష్మమ్మ, రంగారెడ్డి ఇద్దరూ కర్నూలు జిల్లాలో వైద్యులుగా స్థిరపడ్డారు. క్రాంతి అక్క నీలిమ కూడా వైద్య వృత్తిలోనే స్థిరపడింది. ప్రస్తుతం నీలిమ అమెరికాలో వైద్యురాలిగా సేవలందిస్తోంది. 
 
ఇంట్లో అందరూ వైద్య వృత్తిలో ఉన్నప్పటికీ క్రాంతి మాత్రం అందుకు భిన్నమైన లక్ష్యాన్ని ఎంచుకున్నారు. క్రాంతి ఎంచుకున్న లక్ష్యానికి తండ్రి రంగారెడ్డి ప్రోత్సాహం కూడా లభించింది. ప్రజలకు సేవ చేసే ఉద్యోగంలో ఉండాలని అందుకోసం ఐఏఎస్ సాధించాలని తండ్రి చెప్పిన మాటలు గుర్తు పెట్టుకొని ఐఏఎస్ సాధించటానికి ఎంతో కృషి చేశారు. 10వ తరగతి వరకు క్రాంతి కర్నూల్ లో చదివారు. 
 
ఆ తరువాత హైదరాబాద్ లో ఇంటర్ చదివి ఢిల్లీ ఐఐటీలో సీటు రావడంతో ఢిల్లీ ఐఐటీలో చేరారు. ఆ తరువాత ఐఏఎస్ కావాలన్న తన కల దిశగా ప్రయత్నాలు చేశారు. 2013 సంవత్సరంలో తొలిసారి సివిల్స్ రాసి తొలి ప్రయత్నంలోనే క్రాంతి 562వ ర్యాంక్ సాధించారు. క్రాంతి ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ లో జాయిన్ కావడంతో పాటు లక్నోలో శిక్షణ కూడా పొందారు. 
 
2014లో సివిల్స్ పరీక్షలు రాయగా 230వ ర్యాంక్ సాధించగా ఇండియన్ రెవిన్యూ సర్వీస్ వచ్చింది. 2015 సంవత్సరంలో మరలా సివిల్స్ పరీక్షలు రాయగా 65వ ర్యాంక్ తో క్రాంతి ఐఏఎస్ సాధించారు. మొదట నిర్మల్ జిల్లాలో పని చేసిన క్రాంతి మహబూబ్ నగర్ లో ప్రత్యేకాధికారిగా 15 నెలలు పని చేశారు. తాజాగా జరిగిన బదిలీలలో క్రాంతి కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గా చేరారు. ఆటలు, పాటలు బాగా ఇష్టమని టెన్నిస్, బ్యాడ్మింటన్ బాగా ఆడతానని, ఉద్యమ నేపథ్యం మరియు సంస్కృతిపై వచ్చిన జానపదాలను బాగా వింటానని బతుకమ్మ పండుగను బాగా ఇష్టపడతానని క్రాంతి చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: