మీడియా అంటే జనం సమస్యలు ప్రతిబింబించాలి. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు మీడియాలో కవర్ కావాలి. విభిన్న వర్గాల నుంచి సమాచారం సేకరించాలి. అన్ని ప్రాంతాల వారి వాయిస్ మీడియాలో కనిపించాలి. ఇవన్నీ మీడియా సూత్రాలు. కానీ ఇవేవీ ఏపీలోని కొన్ని పత్రికలకు అస్సలు పట్టవు.. వారికి కావాల్సిందల్లా చంద్రబాబు వాయిస్ ఒక్కటే.

 

చంద్రబాబు ఏం చెబితే అదే రైటు.. ఆయన చెప్పిందే అసలైన వాదం.. ఆయన వినిపించిందే సిసలైన ప్రజాసంక్షేమం. అంతే..అంతే.. రెండో మాటకు తావులేదు. టీడీపీ అధినేత చంద్రబాబుకు మీడియ సపోర్టు గురించి పెద్దగా చెప్పాల్సిందేమీ లేదు. అది జగమెరిగిన సత్యం. ప్రత్యేకించి రెండు దిన పత్రికలు ఆయనకు కొమ్ముకాస్తయన్న సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్లిష్టమైన స్థితిలో ఉన్న సమయంలోనూ ఆయా పత్రికలకు తమ నాయకుడు చేసిందే గొప్ప.. తమ నాయకుడి వాదనే రైటు అనేలా ప్రవర్తిస్తున్నాయి.

 

రాష్ట్రం పరిస్థితి ఏంటి.. రాష్ట్రానికి ఏది మంచిది.. అనే చర్చ అస్సలు ఆ మీడియాల్లో కనిపించదు. దీర్ఘ కాలంలో రాష్ట్ర భవిష్యత్, యువత కు ఉద్యోగాలు, రాష్ట్రప్రగతి దృష్టిలో ఉంచుకుని విశాఖను రాజధానిని చేస్తామంటోంది జగన్ సర్కారు. అందుకు తన లాజిక్ తాను వినిపిస్తోంది. అమరావతిని హైదరాబాద్ స్థాయికి తీసుకురావాలంటే కనీసం లక్షన్నర కోట్ల రూపాయలు అవసరమని వాదిస్తోంది.

 

 

అంత డబ్బు అమరావతిపై పెట్టడం కంటే.. విశాఖపై 10 వేల కోట్లు పెడితే హైదరాబాద్ స్థాయికి చేరుతుందని వాదిస్తోంది. అయితే.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రోజుకో ఫుల్ పేజీతో ప్రత్యేక కథనాలు కుమ్మేస్తున్న అగ్రశ్రేణి పత్రికలు ఈ లాజిక్ ను పట్టించుకోవడం లేదు. ఈ లాజిక్ మాకొద్దు. చంద్రబాబే ముద్దు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే అమరావతిలో అన్నీ సమకూరాయి. ఇక అమరావతికి ఖర్చు చేయాల్సిందేమీ లేదని వాదిస్తున్నాయి. మరి ఇవే పత్రికలు ఎన్నికలకు ముందు అమరావతికి లక్షకోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరాన్ని నొక్కివక్కాణిస్తూ ప్రచురించిన కథనాలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. అందుకే వీరికి చంద్రబాబే ముద్దు.. జనం సంగతి వద్దు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: