అమరావతే ముద్దు.. ముడు రాజధానులు వద్దు.. ఇదీ రాజధాని ప్రాంతంలో ఆందోళన చేస్తున్న రైతుల నినాదం. అయితే అందరు రైతులు ఇదే వాదనతో లేరు. ఇందుకు నిదర్శనంగా కొందరు రైతులు సీఎం జగన్ ను కలిశారు. తమ సమస్యలు వివరించారు. తమకు రాజధాని అవసరం లేదని.. కొన్ని నిబంధనలు తొలగిస్తే.. హాయిగా పంటలు పండించుకుంటామని చెప్పారు.

 

వారు ఏమన్నారో వారి మాటల్లోనే వినండి..” చంద్రబాబు ఈ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించకముందు మా భూములు చాలా రేట్ పలికేవి. రాజధాని ప్రకటించిన తరువాత భూముల రేట్లు పడిపోయాయి.ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్‌ ఫీజు పెంచకుండా చంద్రబాబు జోన్లుగా విభజించి రైతులను ఇబ్బందులకు గురి చేశారు. రాజధాని రైతుల కోరుకున్నట్లుగా వారికి అనుగుణంగా పని చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి ముఖ్యం, ఈ ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకువస్తాం. రాజధానిలో అందరూ సంతోషంగా ఉండాలని సీఎం ఆకాంక్షించారు.”

 

" రాజధాని ఎక్కడికి పోవడం లేదు..ఇక్కడే ఉందని సీఎం భరోసా కల్పించారు. ఒక తండ్రి తన కుటుంబంలో బిడ్డలందరికీ ఎలా సమన్యాయం చేస్తారో అదే విధంగా మిగతా ప్రాంతాలకు కూడా సమన్యాయం చేస్తున్నానని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. కేవలం రూ.503 కోట్లు ఖర్చు చేసి ఏపీని చంద్రబాబు అప్పుల ఊబిలోకి నెట్టారు. రాజధాని నిర్మించాలంటే లక్ష పాతిక వేల కోట్లు అవసరం అవుతాయి. మేం మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో రాజధాని వద్దు..ప్రతి ఏటా మూడు నుంచి ఐదు పంటలు పండించుకుంటున్నామని చంద్రబాబుకు ఎంత చెప్పినా వినలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

 

" మా జీవితాలు మేము బతకనివ్వండి అని చంద్రబాబును వేడుకున్నా కూడా వినలేదు. రాజధానితో మాకు సంబంధం లేదు. అభివృద్ధే ముఖ్యమని రాజధాని ప్రాంతవాసులు కోరుకోవడంతో సీఎం వైయస్‌ జగన్‌ సంపూర్ణంగా ఒప్పుకున్నారు.తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలకు మోడల్‌ మున్సిపాలిటీలుగా చేసేందుకు రూ.1200 కోట్లు కేటాయించారు. 2014లో ఎమ్మెల్యే ఆర్కే, వైయస్‌ జగన్‌కు అండగా ఉన్నామని చంద్రబాబు ఐదేళ్లలో మా గ్రామాల్లో ఒక్క రోడ్డు కూడా వేయలేదని రైతులు గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: