2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఆ తరువాత చంద్రబాబు సింగపూర్ తరహా రాజధానిని నిర్మిస్తానని ప్రపంచానికి నమూనా అయ్యే విధంగా అమరావతి నిర్మాణం జరుపుతానని , 20 అంతస్థుల భవనాలు నిర్మించి ఆ భవనాలలో సెక్రటేరియట్లు ఏర్పాటు చేస్తానని, అమరావతిలో ఫ్లై ఓవర్లు నిర్మిస్తానని చెప్పి ఐదు సంవత్సారాల పాలనలో అమరావతిని ఏ మాత్రం అభివృద్ధి చేయలేకపోయారు. 
 
కానీ ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ మాత్రం ప్రస్తుతం చంద్రబాబు అమరావతి విషయంలో ఏ కలలనైతే కన్నారో ఆ కలలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. విశాఖలో 20 అంతస్తులతో మిలీనియం టవర్స్ 1 బి కట్టబోతున్నారు. ఈ భవనంలో నేరుగా పై అంతస్తు వరకు వెళ్లే విధంగా సౌకర్యాలను కల్పించనున్నారని సమాచారం. వాహనాలు కూడా పైకి వెళ్లే విధంగా అత్యాధునిక టెక్నాలజీలను వినియోగించబోతున్నారని సమాచారం అందుతోంది. 
 
ఇది మాత్రమే కాకుండా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయించి ఆ ఎయిర్ పోర్ట్ కు లింక్ ఉండే విధంగా సెక్రటేరియట్ నుండి ఎనిమిది చోట్ల పిల్లర్లు వేసి 15 కిలోమీటర్ల దూరంతో 
సెక్రటేరియట్ వైపు నుండి నేరుగా ఎయిర్ పోర్టుకు వెళ్లే విధంగా కూడా మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారని సమాచారం. ఈ వార్తల గురించి అధికారికంగా సమాచారం అందాల్సి ఉంది. 
 
చంద్రబాబు గత ఐదు సంవత్సరాలలో ఏవైతే కలలు కన్నారో ఆ కలలను జగన్ నెరవేరుస్తున్నాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నా మాటల్లో తప్ప చేతల్లో నిర్మాణాలు జరగలేదు. కానీ జగన్ మాత్రం మాటల్లో సింగపూర్ తరహా రాజధాని మరో దేశం తరహా రాజధాని అని చెప్పకపోయినా అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే విదేశాల తరహా రాజధాని దిశగా చర్యలు చేపడుతూ ఉండటం గమనార్హం. 
 
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: