తిరుమల కొండపై దేవతలు విహరిస్తుంటారని... అందుకే ఆ ప్రాంతంలో విమానాలు నిషేధమన్నారు. ఇటు సైన్స్ ప్రకారం... ఆ ప్రాంతంలో పాజిటివ్ రేస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే అక్కడ ఎలాంటి విమానాలు తిరిగినా అవి పేలిపోయి ప్రమాదాలు జరుగుతుంటాయని తేలింది. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి విమాన వేంకటేశ్వరస్వామికి ఎగువన విమానాలు వెళ్లకూడదనే నియమం ఉంది. కాగా తిరుమల వెళ్ళిన భక్తులు తప్పనిసరిగా విమాన వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆచారంగా మారింది. వాస్తవానికి పన్నెండేళ్ళ కాలంలో భక్తులకు గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టును దర్శించుకునే భాగ్యం కలగలేదు.

కానీ అందుకు ప్రతిగా ఆనంద నిలయ విమానం మొదటి అంతస్తులో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇలా ప్రతిష్టించిన వేంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉత్తర వాయువ్యంలో ఉంటుంది. అప్పుడు ప్రతిష్టించిన స్వామివారి విగ్రహమే విమాన వేంకటేశ్వర స్వామి. అప్పుడు స్వామివారికి బదులుగా ప్రతిష్టించిన విమాన వేంకటేశ్వర స్వామిని ఇప్పటికీ భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు. 

తిరుమల కొండపై మరోసారి విమానం హల్ చల్ చేసింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ‘నో ఫ్లైయింగ్‌ జోన్‌’గా ప్రకటించిన తిరుమలపై కేంద్రానికి చెందిన సర్వే ఆఫ్‌ ఇండియా(ఎస్‌వోఐ) ఛార్టెర్డ్‌ విమానం రెండు రోజులుగా చక్కర్లు కొడుతోంది. ఐదేళ్లకోసారి విమానాల ద్వారా దేశ భౌగోళిక పరిస్థితులను ఎస్‌వోఐ సర్వే చేయిస్తుంది.  

ప్రస్తుతం రెండు రోజులుగా తిరుమలపై విమానం ఎగరడాన్ని గుర్తించిన టీటీడీ విజిలెన్స్‌ అధికారులు.. చెన్నై ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ (ఏటీసీ)కు ఫిర్యాదు చేశారు. తిరుమల కొండపై విమానాలు తిరిగరాదనే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సైతం కేంద్రాన్ని కోరింది. ఆగమశాస్త్రం ప్రకారం విమానాలు కొండపై తిరగరాదని టీటీడీ అధికారులు చెబుతున్నారు.  

గతంలో బ్రిటీష్ వారి హయాంలో రెండు విమానలు పేలినట్లు ఆధారాలున్నాయని అధికారులు తెలిపారు. ఇకపై తిరుమల క్షేత్రంపైకి విమానాలు పంపబోమని ఏటీసీ అధికారులు చెప్పారన్నారు... విజిలెన్స్‌ వీజీవో మనోహర్‌. దీనిపై గతంలోనూ ఏవియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు తిరుమల తిరుపతి దేవస్థానం ఫిర్యాదు చేసింది.  ప్రస్తుతం రెండు రోజులుగా తిరుమలపై విమానం ఎగరడాన్ని గుర్తించిన టీటీడీ విజిలెన్స్‌ అధికారులు. గతంలో బ్రిటీష్ వారి హయాంలో రెండు విమానలు పేలినట్లు ఆధారాలున్నాయని అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: