దేశ రాజధాని ఢిల్లీలో ఇన్నిరోజులు ప్రధానంగా ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ అని వార్తలు వచ్చినా ఇప్పుడు ప్రధానంగా పోటీ మాత్రం ఆప్, బీజేపీ పార్టీల మధ్యే ఉంది. పోటీ రెండు పార్టీల మధ్యే ఉన్నప్పటికీ అన్ని సర్వేలు ముక్తకంఠంతో ఆప్ పార్టీనే ఢిల్లీలో ఘనవిజయం సాధిస్తుందని చెబుతున్నాయి. ఢిల్లీలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఏడు లోక్ సభ స్థానాలు ఉంటే ఏడు లోక్ సభ స్థానాలలో విజయం సాధించింది. 
 
ఢిల్లీలో బీజేపీ పార్టీ పుంజుకుంది అనుకునేలోపు అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ బీజేపీకి ఊహించని షాక్ ఇవ్వనుందని తెలుస్తోంది. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఏబీపీ న్యూస్ - సీ ఓటర్ సర్వే ఆప్ 59, బీజేపీ 8, కాంగ్రెస్ 3 స్థానాలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది. టైమ్స్ నౌ - ఐ.పీ.ఎస్.ఓ.ఎస్ సర్వే ఆప్ 54 - 60, బీజేపీ 10 - 14, కాంగ్రెస్ 0 - 2 స్థానాలను కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది. 
 
ఎనిమిది నెలల్లోనే బీజేపీ పార్టీ ఢిల్లీలో ఇంత దారుణమైన స్థితికి రావడానికి ఆప్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలే ముఖ్య కారణం. ఢిల్లీలో ఆప్ పార్టీ సొంత సంక్షేమ ఎజెండాతో ముందుకు వెళుతూ ఓటర్లను ఆకర్షిస్తోంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నెలకు 20వేల లీటర్ల నీరు ఇలాంటి పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులు అవుతూ ఉండటంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆప్ సర్కార్ ఢిల్లీలో అమలు చేయకపోవడం బీజేపీకి మైనస్ గా మారింది. 
 
ప్రజల్లో ఆప్ అవినీతి రహిత పాలన అందిస్తోందని ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉండటంతో ముఖ్యమంత్రిగా కేజ్రీవాలే ఉత్తమమని ఢిల్లీ ఓటర్లు ఫిక్స్ అయ్యారని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ ఓటర్లు ఫిబ్రవరి 8వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఆప్ పార్టీ వెంటే నడవనున్నారని స్పష్టమవుతోంది. సర్వేల అంచనాల ప్రకారమే ఫలితాలు వస్తాయా...? లేదా..? చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: