కర్ణాటకలో ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య మొదట బిజెపి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఆ తర్వాత బలనిరూపణ చేసుకో లేక పోవడంతో కాంగ్రెస్ జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అయినప్పటికీ అయినప్పటికీ పట్టువదలని బీజేపీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా... జేడీఎస్  కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తమ వైపు ఆకర్షించింది. దీంతో జెడియు కాంగ్రెస్ పార్టీలకు చెందిన బిజెపిలోకి చేరారు. దీంతో కాంగ్రెస్ జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి పోయింది. దీంతో స్పీకర్ బిజెపి లోకి వెళ్లిన  జేడీయూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అనర్హత వేటు వేశారు. ఇక ఆ తర్వాత ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. అయితే తన గెలుపు కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలందరికీ మంత్రి పదవులు ఇస్తానని హామీ ఇచ్చారు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప. 

 

 

 ఇక కాంగ్రెస్ జెడిఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన వెంటనే ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి టికెట్ కూడా కేటాయించారు. ఆ తర్వాత బీజేపీ టికెట్ కేటాయించి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఇద్దరు ఓడిపోగా 10 మంది ఎమ్మెల్యేలు ఘన విజయం సాధించారు. ఇక ఇప్పుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు గానే తన కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలందరికీ మంత్రి పదవులు ఇచ్చేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప సిద్ధమయ్యారు. మరికాసేపట్లో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప క్యాబినెట్ విస్తరణ చేయనున్నారు. కేబినెట్ విస్తరణలో భాగంగా పది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 

 

 

 అయితే గతంలో... యడ్యూరప్ప ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు... జెడియు సంకీర్ణ ప్రభుత్వం కూల్చేందుకు రాజీనామా చేసిన పదిమంది మంత్రులకు  మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప  మరికొద్ది సేపట్లో క్యాబినెట్ ని విస్తరించనున్నారు. గతంలో ఎడ్యూరప్ప కోసం రాజీనామా చేసి ఆ తర్వాత ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడినా  వారికి కూడా... ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రి పదవులు ఇస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతానికి అయితే ఉప ఎన్నికల్లో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ఎడ్యూరప్ప.మరి  కొద్దిసేపట్లో ఈ క్యాబినెట్ విస్తరణ జరగనుండగా పదిమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: