సోషల్ మీడియా వాడకం పెరిగిన పోయిన తర్వాత ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకునేందుకు దీనిని వేదికగా వాడుకుంటున్నారు. తమ ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తూ రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు సోషల్ మీడియాను వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా వైసిపి ప్రభుత్వంపై బురద చల్లేందుకు నిత్యం ప్రయత్నిస్తున్నరాజకీయ ప్రత్యర్థులు తాజాగా వైసీపీ మంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం చేస్తుండడం ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిని తీవ్రంగా పరిగణించిన మంత్రి అనుచరులు ఈ తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 


అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం నుంచి గెలిచిన శంకర్ నారాయణ కు సామాజిక వర్గాల సమీకరణ లో భాగంగా జగన్ మంత్రి పదవిని కట్టబెట్టారు. టిడిపి అభ్యర్ధి బీకే పార్థసారధిపై ఆయన విజయం సాధించారు. దీంతో జగన్ తన క్యాబినెట్ లోకి తీసుకుని బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు 2014 ఎన్నికల్లో పెనుగొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శంకర నారాయణ పార్థసారథి చేతిలో 17 వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు.


 అయితే ఇప్పుడు వసూళ్ల నారాయణ అంటూ సోషల్ మీడియాలో ఆయనపై రాజకీయ ప్రత్యర్ధులు ప్రచారం చేయడం, అది కాస్త వైరల్ అవడంతో కియా ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ లో వైసిపి నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు విచారణ చేసిన పోలీసులు పెనుకొండ మండలం వెంకటగిరి పాలానికి చెందిన శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి పై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. తగిన ఆధారాలు లేకుండా వ్యక్తిగత ప్రతిష్ట తో పాటు, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా వ్యవహరించడం సరికాదని సూచిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: