పొద్దున్న అంతా కస్టపడి రాత్రి ఒక చుక్క వేస్తె ఆ కిక్కే వేరప్పా.. అనుకుంటున్నారు మందుబాబులు.. అందుకే సాయంత్రం ఐదు అయితే ఇంక చెప్పనక్కర్లేదు. బారులు ముందు క్యూలు ఉన్నాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్యాప్ దొరికితే కాస్త చుక్కేసుకోని పడుకోవాలని మందు బాబులు చాలా వరకు ముందుంటారు. 

 

ఈ క్రమంలో ఓ ప్రాంతంలో మద్యం కుళాయిలు ఏర్పాటుచేశారట. ఇంకా మందు ప్రియులు ఆగుతారా ఎక్కడో చూడడండి.. కేరళలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ అపార్టుమెంటు వాసులకు తాగునీటికి బదులు కుళాయిల్లో మద్యం రావడంతో ఒక్కసారిగా వారు ఖంగుతిన్నారు. మొదట్లో ఒకరి ఇంట్లో అనుకొని పరిశీలించగా మిగతా ఇళ్లలోనూ అలాగే రావడం మొదలైంది. 

 

ఇలా మొత్తం 18 కుటుంబాల కుళాయిల్లోనూ రావడంతో అవాక్కవడం వారి వంతైంది. అధికారుల సహకారంతో కారణాలను విశ్లేషించగా ఆసక్తికర కోణం బయటపడింది.ఆరేళ్ల క్రితం ఈ అపార్టుమెంట్‌ సమీపంలో బార్‌ ఉండేది. తనిఖీల్లో భాగంగా అక్కడి ఆబ్కారీశాఖ అధికారులు బార్‌పై దాడి చేసి భారీగా స్థాయిలో అక్రమంగా నిలువ ఉంచిన మద్యాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసి నిల్వ ఉంచిన దాదాపు 6వేల లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేశారు అధికారులు. 

 

అనంతరం విచారణ చేపట్టిన కోర్టు.. పట్టుబడిన అక్రమ మద్యాన్ని నాశనం చేయాలని అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఇటీవలే అధికారులు బార్‌ పక్కనే ఒక గుంత తవ్వి దాదాపు 6 గంటల పాటు కష్టపడి ఒక్కో బాటిల్‌లోని మద్యాన్ని ఆ గుంతలో పారబోశారు. అయితే ఆ ప్రదేశంలో బిల్డింగ్ రావడంతో అక్కడ బోరును వేశారు అయితే ఆప్రాంతంలో నీళ్లకు బదులుగా మందు కుళాయిల్లో రావడంతో అందరు షాక్ కు గురయ్యారు. ఈ విషయాన్ని స్థానిక మున్సిపల్‌, ఆరోగ్య శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కారకులైన ఆబ్కారీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: