ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కరోనా వైరస్ భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ గురించి ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో టిబెటన్ మెడికల్ సెంటర్ కు చెందిన పరిశోధకులు కరోనా వైరస్ సోకకుండా మెడిసిన్ ను కనిపెట్టారు. మీన్‌ త్సీ ఖాంగ్‌ అనే టిబెటన్ మెడికల్ సెంటర్ కు చెందిన పరిశోధకులు ఒక ట్యాబ్లెట్ ద్వారా కరోనా రాకుండా నిరోధించవచ్చని చెబుతున్నారు. 
 
మీడియాతో ఈ ట్యాబ్లెట్ గురించి టెంజిన్ యెషీ అనే పరిశోధకుడు మాట్లాడుతూ ఐదు రకాల మూలికలను ఉపయోగించి కరోనాను నిరోధించే ట్యాబ్లెట్ ను కనిపెట్టినట్టు చెప్పారు. కానీ ఇది మిగతా ట్యాబ్లెట్ల మాదిరిగా నోటి ద్వారా తీసుకోవటం వీలు కాదని అన్నారు. ఈ ట్యాబ్లెట్ ను తీసుకొని ఒక నల్లని గుడ్డలో చుట్టి ఐదు రకాల దారాలను ఐదు రకాల మూలికలకు గుర్తుగా కట్టి మెడలో గొలుసు మాదిరిగా వేసుకుంటే సరిపోతుందని చెప్పారు. 
 
ఈ ట్యాబ్లెట్ నుండి సుగంధాల పరిమళం వస్తుందని ఆ సుగంధాల పరిమళానికి కరోనా వైరస్ ను నిరోధించే శక్తి ఉందని అన్నారు. ఈ ట్యాబ్లెట్ ద్వారా శరీరానికి మరిన్ని ప్రయోజనాలు కూడా చేకూరుతాయని రోగ నిరోధక శక్తిని పెంపొందించే శక్తి కూడా ఈ ట్యాబ్లెట్ కు ఉందని టెంజిన్ యెషీ చెప్పారు. అంటువ్యాధులు ప్రబలడానికి కారణమయ్యే వైరస్ లను కూడా నిరోధించే శక్తి ఈ మెడిసిన్ కు ఉందని పరిశోధకులు చెబుతున్నారు. 
 
హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలకు వెళ్లి ఈ మెడిసిన్ ను కొనుగోలు చేయవచ్చు. మరోవైపు నిన్న ఒక్కరోజునే కరోనా వైరస్ బారిన పడి 73 మంది మృతి చెందారు. ఈ వైరస్ కొత్తగా మరో 31,000 మందికి సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఈ వ్యాధి నుండి పూర్తిగా కోలుకొని 1540 మంది ఆస్పత్రి నుండి విడుదలయ్యారు. చైనా ప్రభుత్వం చైనాకు ప్రయాణించడంపై విదేశాలు విధిస్తున్న నిషేధం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: