మద్యం ప్రియులకు శుభవార్త... ఇకనుండి బీర్, విస్కీ కొనాలంటే ఆన్ లైన్ లోనే కొనుగోలు చేయవచ్చు. అతి త్వరలో నచ్చిన బ్రాండ్ ను ఆన్ లైన్ లోనే కొనుగోలు చేసే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా ఇకనుండి నచ్చిన ఆల్కహాల్ బ్రాండ్ ను కొనుగోలు చేయవచ్చు. ప్రభుత్వాలకు భారీ మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చే ఆల్కహాల్ పరిశ్రమ ఈ కామర్స్ విభాగంలోకి అడుగుపెట్టనుండటం మద్యం ప్రియులకు నిజంగా శుభవార్త అనే చెప్పవచ్చు. 
 
ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ అమ్రిత్ కిరణ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్స్ లో ఆల్కహాల్ పరిశ్రమ సేవలను ప్రారంభించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అతి త్వరలోనే ఆన్ లైన్ ద్వారా మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. మద్యం అమ్మకాలను లిక్కర్ పరిశ్రమ ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా అమ్మే ప్రయత్నాలు చేస్తోందని కిరణ్ సింగ్ చెప్పారు. 
 
ఆన్ లైన్ ద్వారా మద్యం అమ్మకాలు జరిపితే మద్యం అమ్మకాలు గతంతో పోలిస్తే భారీగా పెరుగుదలను నమోదు చేసుకునే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆన్ లైన్ ద్వారా మద్యం అమ్మకాలు అమలులోకి వస్తే నచ్చిన బ్రాండ్ ను ఆర్డర్ చేసుకొని మందుబాబులు మద్యం సేవించవచ్చు. మన దేశంలో కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. 
 
ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలు జరపటం ద్వారా ప్రభుత్వం ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కిరణ్ సింగ్ మాట్లాడుతూ మద్యం అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వాలు కోరుకుంటున్నాయని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 25 సంవత్సరాల వయస్సు ఉన్నవారు మాత్రమే మద్యం కొనుగోలు చేసే అవకాశం ఉందని ఢిల్లీలో కూడా 21 సంవత్సరాలు అర్హతగా విధించాలని కిరణ్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: