వీకెండ్ ఈ జనరేషన్ యూత్‌ నుంచి సీనియర్‌ సిటీజెన్‌ల వరకు అంతా ఈ మాట కోసం వార అంతా కష్టపడుతున్నారు. ఐదురోజుల పాటు పడిన కష్టమంతా ఒక్క రోజులో మర్చిపోయేలా ఎంజాయ్‌ చేయాలని వారమంత ప్లాన్‌ చేసుకుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లటం, ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలు చేసుకోవటం లాంటి వాటితో వీకెండ్‌ పార్టీల్లో మరింత జోష్‌ పెంచుతున్నారు. మరి నిజంగా వీకెండ్‌ పార్టీలు అంత మంచిదా..? వారంలో పడిన కష్టం మర్చిపోవడానికి వీకెండ్‌ పార్టీలే సరైన దారా..? అన్న చర్చ కూడా జరుగుతోంది.


హడావిడి జీవితాల్లో యూత్‌ ఫ్యామిలీతో గడిపే సమయం రోజు రోజుకు తగ్గిపోతుంది. ఒత్తిడి, టార్గెట్‌ల మధ్య పనిచేయటం కారణంగా ఫ్యామిలీతో సరదాగా కాలం గడిపలేకపోతున్నాడు నేటి సగటు మనిషి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వీకెండ్ అవకావాలను కూడా పార్టీలు, పబ్‌లు, ఫ్రెండ్స్‌ అంటూ ఫ్యామిలీకి దూరంగా ఉండటం ఎంత కరెక్ట్ అంటున్నారు నిపుణులు. అంతేకాదు వీకెండ్ పార్టీలకు దూరంగా ఉండటం వల్ల లాభాల కన్నానష్టాలే ఎక్కవ అంటూ విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా లేట్‌ నైట్ వరకు మేల్కోని ఉండటం, శృతిమించి మధ్యం తాగటం లాంటి వాటి వల్ల ఆరోగ్యపరంగా కూడా నష్టమే.


వారమంత ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును ఉద్యోగులు వీకెండ్ పార్టీల పేరుతో కర్పూరంలా ఆవిరి చేస్తున్నారు. దీంతో మిగతా రోజుల్లో కుటుంబ పోషణ భారంగా మారుతోంది. శనివారం అర్థరాత్రి వరకు ఫ్రెండ్స్‌తోనే పార్టీలో ఉండి, ఆదివారం ఆలస్యంగా నిద్రలేవటం వల్ల కుటుంబంతో గడిపే ఆ ఒక్కరోజును కూడా కోల్పోతున్నారు. దీని మూలంగా కుటుంబం బంధాలు దెబ్బతింటున్నాయి. పిల్లలతో ఏ మాత్రం సమయం గడపకపోవటంతో వారికి తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలకు కలుకగపోగా.. నాన్న అంటే డబ్బులిచ్చే ఏటీఎంలా, అమ్మ అంటే వంట చేసి పెట్టే కుక్‌ అన్న భావనలోకి వచ్చేస్తున్నారు. అందుకే వీకెండ్‌ అంతా పార్టీల పేరుతో వేస్ట్ చేసుకోకుండా ఫ్యామిలీతో గడిపితేనే కరెక్ట్ అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: