ఎవరి క్రెడిట్, డెబిట్ కార్డులు వారి దగ్గరే ఉంటాయి. కానీ వాటిలో డేటా డార్క్ వెబ్ (డార్క్ వెబ్ హకెర్స్) చేతిలోకి ఎలా వెళ్లింది..? మీతో మాత్రమే ఉండాల్సిన ఐడీలు, పాస్‌ వర్డ్‌ లూ వాళ్ల దగ్గరకు ఎలా వెళ్లాయి అన్న డౌట్ ఇప్పుడు మీకు వచ్చే ఉంటుంది. నిజానికి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేసే ఒక వెబ్‌సైట్ గత సంవత్సరం నుంచి భారతీయుల సీక్రెడ్ డేటా సేకరిస్తోంది. ఇది ఇలా ఉంటె ఇప్పుడు ఆ సైట్ యాజమాన్యం ఆ డేటాను అమ్మకానికి పెట్టింది. ఇలాంటి సమాచారం ఏదైనా అమ్మకానికి దొరికితే అక్రమార్కులు కొనుక్కోకుండా ఎలా ఉంటారు. మొత్తం 5 లక్షల మంది ఇండియన్స్ డేటా ఇప్పుడు హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోయింది. ఒక్కో డెబిట్ కార్డు రేటూ రూ.5వేలు, ఒక్కో క్రెడిట్ కార్డు రేటూ రూ.10 వేలంటూ ఇంటర్నెట్‌లో పెట్టి అమ్మేస్తే హాట్ కేకుల్లా కొనేశారు అక్రమార్కులు. కేవలం రూ.5వేలు పెట్టి కొన్న వ్యక్తి సైలెంట్‌ గా ఎందుకుంటాడు.

 


అలాంటి డెబిట్ కార్డే క్లోనింగ్‌ చేసి కొత్త కార్డుని తయారుచేస్తాడు. అందుకు కావాల్సిన డేటా ఎలాగో ఉంటుంది కాబట్టి నకిలీ కార్డు తయారుచేసి దానితో ATM సెంటర్ కి వెళ్లి ఆ అకౌంట్‌లో డబ్బు మొత్తం డ్రా చేస్తాడు. అదే క్రెడిట్ కార్డు అయితే క్లోన్ కార్డుతో విలువైన వస్తువుల్ని వారు కొనేస్తారు. ఇదే ఇప్పుడు బయట జరుగుతోంది. జోకెర్స్ స్టాష్ అనే వెబ్‌ సైట్ ఈ డేటా మొత్తాన్ని అమ్మకానికి పెట్టింది. ఇందులో డెబిట్, క్రెడిట్ కార్డుల ఎక్స్‌పైరీ డేట్స్, 14 - 16 డిజిట్ కార్డ్ నంబర్స్, కార్డుదారుల పేర్లు, CVV/CVC కోడ్లు, చివరకు ఈ-మెయిల్ అడ్రెస్‌ లు కూడా అమ్మేస్తోంది. భారత్ లో డెబిట్, క్రెడిట్ కార్డుల డేటా చోరీల్లో ఇది రెండో అతి పెద్దది. మొత్తంగా  4,61,976 కార్డుల్ని ఒక్కోటీ 9 డాలర్లకు అమ్మగా రూ.30 కోట్లు ఆ వెబ్‌సైట్ సంపాదించినట్లు తెలిసింది. 2018-19 సంవత్సరంలో మొత్తం 1866 డేటా చోరీ మోసాలు జరిగాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఒక్కో చోరీ వల్లా సరాసరి రూ.20 లక్షలు పోయినట్లు అర్ధమవుతుంది.

 

 

ప్రస్తుతం ఈ చోరీపై దేశంలోని అన్ని బ్యాంకుల అధికారులూ చాలా అప్రమత్తమయ్యారు. ఎవరికైనా అనుమానిత ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు అనిపిస్తే మాత్రం వెంటనే తమ బ్రాంచ్‌ కి వాళ్ళు రమ్మంటున్నారు. ఇలాంటి చోరీలను అడ్డుకోవడానికి బ్యాంకులు ఎన్ని సెక్యూరిటీ కార్యకలాపాలు చేపడుతున్నా వాటిపై హ్యాకర్ల దాడులు కొనసాగుతూనే ఉండటం ఆందోళన కలిగించే అంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: