నిన్న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. గతంతో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గినప్పటికీ ముస్లింలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో మాత్రం పోలింగ్ శాతం పెరిగింది. రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం ముస్లిం నియోజకవర్గాలలో పెరిగిన పోలింగ్ బీజేపీ పార్టీకి నష్టం చేకూర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం తీసుకొనిరావటంతో ఆ ప్రభావం ముస్లిం ఓటర్లు ఎన్నికల్లో చూపించారా...? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఢిల్లీలోని సీలాంపూర్ ప్రాంతంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉంటారనే విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ 71.4 శాతం పోలింగ్ నమోదైంది. ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే ముస్తాఫాబాద్ లో 70.55 శాతం పోలింగ్ నమోదు కాగా బాబర్ పూర్ లో 65.4 శాతం పోలింగ్ నమోదైంది. శాదరలో 65.78 శాతం, మటియా మహల్ లో 68.36 శాతం, సీమపురిలో 68.08 శాతం పోలింగ్ నమోదైంది. 
 
పోలింగ్ శాతంలో స్వల్ప మార్పులు ఉండవచ్చని ఎలక్షన్ కమిషన్ చెబుతోంది. మరోవైపు ముస్లింల జనాభా తక్కువగా ఉండే ప్రాంతాలలో మాత్రం తక్కువ శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. ముస్లింల జనాభా తక్కువగా ఉండే రిథులా, బల్లిమారన్, ఓక్లా, చాందినీ చౌక్ లో 60 శాతానికి అటూ ఇటుగా పోలింగ్ శాతం నమోదైంది. ఓక్లా నియోజకవర్గంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. 
 
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఆప్ పార్టీ విజయం సాధించగా ఈ ఎన్నికల్లో కూడా ఆప్ పార్టీనే విజయం సాధించటం గమనార్హం. ఎగ్జిట్ ఫోల్ ఫలితాలన్నీ ఆప్ పార్టీకే అనుకూలంగా ఉండగా బీజేపీ 15 స్థానాలకు అటూఇటుగా గెలుచుకునే అవకాశాలు ఉన్నయని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఒకటీ లేదా రెండు స్థానాలలో విజయం సాధించవచ్చని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ నెల 11వ తేదీన ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: