ఈ మధ్య కాలంలో యువతను విపరీతంగా ఆకర్షిస్తున్న అప్లికేషన్లలో టిక్ టాక్ కూడా ఒకటి. ఈ టిక్ టాక్ యాప్ ద్వారా వీడియోలు తీస్తూ, వీడియోలను పోస్ట్ చేస్తూ టిక్ టాక్ వీడియోలను ఎంతమంది లైక్ చేశారో, ఎంత మందికి షేర్ చేశారనే కుతూహలం టిక్ టాక్ వాడే వారిలో రోజురోజుకు పెరిగిపోతుంది. ఆఖరికి దేవాలయానికి వెళ్లినా కూడా కొందరు అక్కడ కూడా టిక్ టాక్ వీడియోలు చేస్తూ భక్తులకు, పూజారులను వారికి తెలియకుండానే ఇబ్బందులు పెడుతున్నారు. 
 
తాజాగా అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయంలో యువత టిక్ టాక్ చేయడం వలన భక్తులు ఇబ్బందులు పడుతున్నారని గుడి యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో ఆలయ నిర్వాహకులు టిక్ టాక్ యాప్ గురించి చర్చించి ఆలయ ప్రాంగణంలో టిక్ టాక్ వీడియోలు చేయడాన్ని పూర్తిగా నిరోధిస్తున్నామని ప్రకటన చేసింది. శిరోమణి గురుద్వారా పర్భంధక్ కమిటీ ఈ మేరకు ప్రకటన చేసింది. 
 
ఆలయ నిర్వాహకులు గుడిలో ఇక్కడ టిక్ టాక్ నిషిధించబడింది అని పోస్టర్లను కూడా విడుదల చేయడం గమనార్హం. ఆలయ నిర్వాహకులు ఈ నిబంధనల తరువాత కూడా ఎవరైనా టిక్ టాక్ చేసినట్లు తేలితే ఆలయంలోకి మొబైల్ ను కూడా నిషేధించే ఆలోచనలో ఉన్నామని అన్నారు. ఆలయ ప్రధాన పూజారి టిక్ టాక్ నిషేధం గురించి మీడియాతో మాట్లాడి ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పారు. 
 
టిక్ టాక్ యాప్ కారణంగా ఆలయంలో అనేక ఇబ్బందికర ఘటనలు చోటు చేసుకున్నాయని టిక్ టాక్ వీడియోలు చేస్తున్న సమయంలో వద్దని కొందరు పూజారులు వారించడంతో పూజారులకు, భక్తులకు మధ్య గొడవలు జరిగాయని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ ఆలయంలో ముగ్గురు అమ్మాయిలు ఒక పంజాబీ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. భక్తుల నడవడిక, సందర్శకుల ప్రవర్తన ఆధారంగా మొబైల్ నిషేధం గురించి కూడా నిర్ణయం తీసుకోబోతున్నామని ఆలయ నిర్వాహకులు చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: