ఈ మధ్య కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు కొన్ని వినటానికి వింతగాను మరియు ఆశ్చర్యంగాను అనిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా రొంపిచర్లలో 21 సంవత్సరాల వయస్సు గల యువకుడు తనకు దాదాపు రెట్టింపు వయస్సు ఉన్న భర్త చనిపోయిన మహిళను వివాహం చేసుకుంటానని పట్టుబట్టి పెళ్లి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. పూర్తి వివరాలలోకి వెళితే ఒక యువకుడు 40 సంవత్సరాల వితంతువును ప్రేమించాడు. ఆ మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఆ యువకుడు మాత్రం ఆ మహిళనే పెళ్లి చేసుకుంటానని పట్టబట్టాడు. కానీ యువకుడి తల్లిదండ్రులు మాత్రం అతని ప్రేమకు ఒప్పుకోలేదు. తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో యువకుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. చివరకు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. 
 
రొంపిచెర్లకు చెందిన 21 సంవత్సరాల యువకుడు వేరే గ్రామానికి చెందిన 40 సంవత్సరాల వితంతువుతో ప్రేమలో పడ్డాడు. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పి పెళ్లి చేయాలని కోరాడు. కానీ ఇద్దరు పిల్లలు గల తల్లితో పెళ్లి ఎందుకని యువకుని తల్లిదండ్రులు అతనిని వారించారు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో చనిపోవడానికి యువకుడు పాకాల రైల్వే స్టేషన్ కు వచ్చాడు. 
 
తాను చనిపోవాలని అనుకుంటున్నానని తన స్నేహితుడికి మొబైల్ ద్వారా యువకుడు మెసేజ్ పంపాడు. మెసేజ్ చదివిన యువకుని మిత్రుడు వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. డయల్ 100 నుండి పాకాల ఎస్సైకి సమాచారం అందగా పాకాల ఎస్సై రైలు పట్టాల వెంట నడుస్తున్న యువకున్ని గుర్తించి అప్పటికే వెనుక రైలు వస్తూ ఉండటంతో గట్టిగా హెచ్చరించారు. 
 
యువకుడు పక్కకు తప్పుకున్నాడు కానీ రైలు పట్టాలపై పడుకోవటానికి ప్రయత్నించటంతో పోలీసులు అతనిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ఆ తరువాత పోలీసులు యువకునికి కౌన్సెలింగ్ ఇచ్చారు. కౌన్సెలింగ్ అనంతరం పోలీసులు యువకుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: