మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం సృష్టించిన వినాశనం ఇంకా మన కళ్ల ముందు మెదులుతూనే ఉంది. ఇప్పటివరకు భూమిపై జరిగిన యుద్ధాల గురించి మనం విన్నాం కానీ ఇప్పుడు అంతరిక్షంలో యుద్ధం మొదలుకానుంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రెండు దేశాలు అంతరిక్షంలో ఢీ అంటే ఢీ అంటూ యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. అత్యాధునికమైన ఉపగ్రహాలతో రెండు దేశాలు యుద్ధానికి దిగనున్నాయి.
 
నిపుణులు ఈ యుద్ధాన్ని మూడో ప్రపంచ యుద్ధానికి ట్రైలర్ అని భావిస్తున్నారు. అమెరికా ఇంటెలిజెన్స్ శాటిలైట్ కు దగ్గరగా రష్యా శాటిలైట్ వెళ్లడంతో పాటు ఏ క్షణమైనా అమెరికా నిఘా శాటిలైట్ పై రష్యా శాటిలైట్ దాడి చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. రష్యా, అమెరికా దేశాల మధ్య అంతరిక్ష యుద్ధం వస్తే ఈ భూప్రపంచంలో ఏం జరుగుతుంది..? ఈ భూప్రపంచం అంతమవుతుందా...? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 
 
అంతరిక్షంలో రెండు శక్తివంతమైన దేశాలు ఢీ కొంటూ ఉండటంతో స్పేస్ లో రష్యా టార్గెట్ అమెరికానేనా...? అమెరికా వ్యూహం ఏమిటి..? స్పేస్ లో రష్యా, అమెరికా ఉపగ్రహాల మధ్య ఏం జరుగుతోంది...? అనే ప్రశ్నలు ప్రపంచాన్నే భయాందోళనకు గురి చేస్తున్నాయి. అమెరాకా శాటిలైట్ ను రష్యా శాటిలైట్ టార్గెట్ చేయడంతో ఈ రెండింటి మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరిగే ప్రమాదం ఉంది. 
 
అంతరిక్షంలో యుద్ధానికి సంబంధించిన వార్తలు వెలువడుతూ ఉండటంతో అంతరిక్ష శాస్త్రవేత్తలు భయాందోళనకు గురవుతున్నారు. భూమిపై బద్ద శత్రువులయిన అమెరికా, రష్యా అంతరిక్షంలో కూడా స్పేస్ వార్ దిశగా అడుగులు వేస్తున్నారు. అమెరికా ఉపగ్రహం యూ.ఎస్.ఏ. 245 2013 నుండి ఇంటెలిజెన్స్ మిషన్ లో ఉంది. శత్రువుల కదలికలను, రహస్య సమాచారాన్ని అమెరికాకు ఈ ఉపగ్రహం చేరవేస్తోంది. జనవరి 20వ తేదీన రష్యా ఉపగ్రహం 2542 అమెరికా ఉపగ్రహానికి దగ్గరగా వచ్చింది. రష్యా ఉపగ్రహం అమెరికా ఉపగ్రహానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను తీసింది. ఆ తరువాత అమెరికా ఉపగ్రహం చుట్టూ రష్యా ఉపగ్రహం తిరిగింది. కేవలం ఈ రెండు ఉపగ్రహాల మధ్య కేవలం 150 మీటర్ల దూరం ఉండటంతో ఈ స్పేస్ వార్ పర్యావసానాలు ఏ విధంగా ఉంటాయో అని అంతరిక్ష శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: