ప్రపంచాన్ని ఇప్పుడు గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఇండియాను సైతం భయపెడుతున్నది.  ఈ వైరస్ దెబ్బకు చైనా మొత్తం గుల్లయ్యింది.  చైనా దీని వలన ఇప్పటికే వేలాదిమంది మరణించారు.  లక్షల సంఖ్యలో వ్యక్తులు ఈ వైరస్ బారిన పడ్డారు.  ముఖ్యంగా వుహాన్ నగరం ఈ వైరస్ ధాటికి విలవిలలాడిపోతుంది.  చైనా మరణించిన వారిలో అధికశాతం మంది వుహాన్ నగరంలోనే ఉండటం విశేషం.

 
ఈ వైరస్ కు ఇప్పటి వరకు ఖచ్చితమైన విరుగుడు కనుగొనకపోవడంతో మిగతా దేశాలు కూడా భయపడుతున్నాయి.  ఖచ్చితమైన విరుగుడు లేకపోవడంతో దీని ప్రభావం రోజురోజుకు ఉదృతం అవుతున్నది.  ఎక్కడ చూసినా దీనికి సంబంధించిన బాధితులే కనిపిస్తున్నారు.  ఇప్పటికే ప్రపంచంలో 30కిపైగా దేశాల్లో ఈ వైరస్ వ్యాపించింది.  


ఈ వైరస్ కారణంగా చైనాకు లక్షల కోట్ల రూపాయల నష్టం వస్తోంది.  చైనాతో పాటు ఇప్పుడు ఇండియాను ఈ వైరస్ భయపెడుతున్నది.  మొదట ఇండియాలో కేరళలో కనిపించిన ఈ వైరస్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కు కూడా వ్యాపించింది.  పశ్చిమ బెంగాల్ లో ముగ్గురికి ఈ వైరస్ సోకింది.  ఈ వైరస్ ఇప్పుడు వేలాది మందికి వ్యాపించి ఇబ్బందులు పెడుతున్నది.  ఈ వైరస్ వలన ఇండియాలో మిగతా రాష్ట్రాలు కూడా కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.  


ఇండియాలో మొత్తం 6 గురు అధికారికంగా వైరస్ బారిన పడినట్టు సమాచారం.  దీంతో పాటుగా ఇంకా ఎంతమంది వైరస్ బారిన పడి ఉంటారు అన్నది తెలియాల్సి ఉన్నది.  అంతుచిక్కని ఈ వైరస్ ను అడ్డుకోవడానికి ఇండియా ఇప్పటికే సమాయత్తం అయ్యింది.  ఎక్కడికక్కడ దీనికి సంబంధించిన హాస్పిటల్స్ ను నెలకొల్పి అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నది.  మరి ఏమౌతుందో చూడాలి.  వైరస్ ను అడ్డుకుంటుందా లేదంటే ఇబ్బందుల పాలవుతుందా ? ఇండియాలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కాబట్టి కొంతమేర తట్టుకునే అవకాశం ఉన్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: