ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ పేరు వింటే చాలు గజగజా వణికిపోతున్నాయి. చైనా దేశంలో ఇప్పటికీ పరిశ్రమలు తెరచుకోకపోవటంతో పాటు ఆటో మొబైల్ రంగంపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కరోనా ప్రభావం వలన చైనా దేశంలో వాహనాల అమ్మకాలు రోజురోజుకి పడిపోతున్నాయి. కరోనా వైరస్ ఎఫెక్ట్ చైనాపై ఎంతగా పడిందంటే వాహనాల అమ్మకాలు ఏకంగా 18 శాతం పడిపోయాయి. కరోనా ఎఫెక్ట్ తో చైనా దేశ రేటింగ్ ఘోరంగా దెబ్బ తింటోంది. 
 
మన దేశంలోని మిజోరాం, మణిపూర్ రాష్ట్రాలు చైనా నుండి ఆహారం, ఇతర ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధించాయి. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి 1000 మందికి పైగా చనిపోగా 70,000 మంది అధికారికంగా కరోనా వైరస్ బారిన పడినట్టు నిర్ధారణ అయింది. ఇప్పటివరకు కరోనాకు వ్యాక్సిన్ కనుక్కోలేకపోవటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. చైనా దేశ ఆర్థిక వ్యవస్థను కరోనా పూర్తిగా దెబ్బ తీసింది. 
 
చైనాకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోగా చైనాకు టూరిజం ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గింది. చైనాలో ఇళ్ల అమ్మకాలు ఏకంగా 90 శాతం డౌన్ అయ్యాయి. 2003 సంవత్సరంలో సార్స్ వచ్చినప్పుడు చూపించిన ప్రభావం కన్నా కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉందని చైనా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. కరోనా వైరస్ భయంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో చైనాలో పరిశ్రమలు ఇప్పటికీ తెరచుకోవడం లేదు. 
 
ఇంటర్నేషనల్ మార్కెట్ లో చైనా ఉత్పత్తుల దిగుమతులకు డిమాండ్ తగ్గడం కూడా చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రముఖ సంస్థ హ్యూందాయ్ ప్రోడక్ట్ లను కూడా నిలిపివేసింది. చైనాలో కరోనా వైరస్ కారణంగా కొందరికి పనులు కూడా దొరకడం లేదు. పనులు దొరకకపోవడంతో ఆదాయం లేక పూట గడవటమే వారికి కష్టంగా మారింది. ఏప్రిల్ నెల తరువాత పరిస్థితులలో మార్పు రావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: