కొన్ని కోట్ల జీవరాశులలో అత్యంత విశ్వాసమైనది శునకం. అది మన కోసం చచ్చి పోవడానికి అయినా సిద్ధమవుతోంది. రోజుకి ఒక్క అన్నం ముద్ద పెట్టినా మనల్ని ఎంతగానో ప్రేమిస్తుంది. మనం ఎంత కొట్టినా ఎంత కిరాతకంగా చూసుకున్నా అది మాత్రం ఎప్పుడూ మనకి ఎటువంటి హానీ చెయ్యదు. ఇంకా మనల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. అదే శునకం యొక్క గొప్పతనం. అందుకే కొంతమంది శునకాలను ఎంతో ప్రేమగా పెంచుతూ వాటికి రాజభోగాలను సమకూరుస్తారు. ఇలా చేసినందుకు ఆ శునకాలు తమ యజమానులకు ఏదో ఒక విధంగా ఎంతో సహాయం చేస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఒక శునకం తమ యజమాని ప్రాణాలను కాపాడి అందరిని ఫిదా చేస్తున్నాయి.



వివరాలు తెలుసుకుంటే... యునైటెడ్ కింగ్ డంలో వేల్స్ దేశంలో నివసించే లిండా(65) అనే పేరు గల ఓ మహిళ 3 జర్మన్ షిప్ యార్డ్ శునకాలను పెంచుతుంది. అయితే బియా అనే శునకాన్ని ఆమె 5 ఏళ్ల పాటు పెంచుతుండగా... బియా కి 3 కుక్క పిల్లలు జన్మించాయి. అయితే వాటిని ఎవరికి దత్తత ఇవ్వకుండా ఆమె పెంచుకుంటుంది. ఈ క్రమంలోనే ఒకరోజు లిండా తన సోఫాలో పడుకున్నప్పుడు బియా వచ్చి ఆమె బ్రెస్ట్ ని వాసనా చూస్తూ గట్టిగ తన తలతో ప్రెస్ చేసింది. దీంతో బియా కుక్క ప్రవర్తనతో లిండా ఆశ్చర్య పోయింది. అయితే తర్వాత కూడా బియా తన యజమాని బ్రెస్టులను వాసన చూడటం రిపీట్ చేసింది. ఇలా ప్రతిరోజూ లిండా పైకి ఎక్కి మరీ ఆమె బ్రెస్టులను తన తలతో నొక్కిపట్టి వాసన చూడడం ఆరంభించింది. దీంతో ఆమెకు తన బ్రెస్ట్ లో ఏదో ఉందని అర్థమైంది. ఒకసారి డాక్టర్ కి చూపించుకుందాం అనుకుంది.


అనుకున్నట్టు ఆమె ఒక ఆసుపత్రికి వెళ్లి కొన్ని చెకప్పులు చేయించుకుంది. ఒక మమ్మోగ్రామ్ చెకప్ లో ఆమె బ్రెస్ట్ లో క్యాన్సర్ కణతి పెరుగుతుందని తేలింది. ఈ రకమైన కణతి చాలా ప్రమాదం అయినదని కొద్ది సమయంలోనే శరీరంలోని అన్ని భాగాలకు వ్యాపించి మనిషిని చంపేస్తుందని వాళ్లు తెలిపారు. ఇంకా కొన్ని రోజుల పాటు మీరు ఆలస్యం చేసి ఉంటే మీ ప్రాణాలు కాపాడటం అసాధ్యమయ్యేదని డాక్టర్లు ఆమెకు చెప్పారు. దీంతో ఆమె మాట్లాడుతూ... నిజానికి నా శరీరంలో క్యాన్సర్ కణతి పెరుగుతుందని నా కుక్క వలన తెలిసింది. లేకపోతే నేను హాస్పిటల్ కి వచ్చే దాన్ని కాదని చెప్పింది. దీంతో డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆమెకు క్యాన్సర్ చికిత్స అందించి ఆమె ప్రాణాలను సురక్షితంగా కాపాడారు. కేవలం తన కుక్క బియా కారణంగానే నేను భూమ్మీద ప్రాణాలతో ఉన్నానని ఆమె తన 4 శునకాలని మాట్లాడుతూ మీడియాతో చెప్పింది. ఏదేమైనా శునకాలకు క్యాన్సర్, ఇంకా తదితర వ్యాధులను తమ వాసన సామర్థ్యంతో పసిగట్టగల అని నిపుణులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: