ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తీసుకొచ్చింది.  ప్రస్తుతం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీల్లో ఉన్న జగన్ నిన్నటి రోజున కేంద్రం హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన విషయాలు చర్చించారు.  వీటితో పాటుగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కూడా చర్చించారు.  రాత్రే జగన్ అమరావతికి రావాల్సి ఉన్నా ఈరోజు న్యాయశాఖామంత్రితో మీటింగ్ ఉండటం వలన ఈరోజు ఢిల్లీలోనే ఉండిపోయారు.

 
దిశ బిల్లు విషయంలో జగన్ కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది.  దిశ బిల్లుతో పాటుగా శాసనమండలి రద్దు విషయంపై కేంద్రానికి విన్నవించారు.  దీనిపైన కేంద్రం సానుకూలంగా స్పందించింది.  మండలికి లైన్ క్లియర్ అయ్యినట్టుగా సమాచారం.  ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేలోపుగానే దిశబిల్లు, మండలి రద్దు తదితర విషయాలను లైన్ క్లియర్ కావాల్సి ఉన్నది.  


వీటితో పాటుగా రాష్ట్రానికి కావాల్సిన నిధులు విషయంపై కూడా కేంద్రం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.  మంత్రి రవిశంకర్ కూడా దీనిపై సానుకూలంగా స్పందించినట్టుగా సమాచారం.   ఈరోజు రేపు కూడా జగన్ ఢిల్లీలో ఉండబోతున్నారని సమాచారం.  దీంతో పాటుగా హైకోర్టును కర్నూలు తరలించేందుకు కూడా రవిశంకర్ హామీ ఇచ్చినట్టుగా సమాచారం. 


మూడు రాష్ట్రాల రాజధానుల విషయంలో జగన్ ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలామంది ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ మరికొందరు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటె ఈరోజు అమరావతిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ పర్యటనలో భాగంగా  రాజధాని ప్రాంతంలో రైతులను కలిసి పరామర్శించబోతున్నా సంగతి తెలిసిందే. దీనిపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. బడ్జెట్ సమావేశాల తరువాత రాష్ట్రంలో అనేక మార్పులు జరగబోతున్నాయి. బడ్జెట్ సమావేశాల తరువాత విశాఖకు రాజధానిని మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: