తొందర్లోనే బ్యాంక్ ఖాతాదారులకు బాదుడు తప్పేలా కనబడుటలేదు. దీనితో ఇప్పుడు ఏటీఎం చార్జీలు కొద్దిగా పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. దీనితో ఏటీఎం నుంచి డబ్బులు విత్‌ డ్రా చేయడం, బ్యాలెన్స్ లాంటివి చెక్ చేయడం ఇప్పుడు మరింత బాదుడు ఎక్కువ అవుతుంది. దీనితో బ్యాంక్ కస్టమర్లపై డైరెక్ట్ గానే ఎఫెక్ట్ పడే ఛాన్స్ చాలా ఉంది. అయితే ఇది ఇలా ఉంటే ఏటీఎం ఆపరేటర్ల అసోసియేషన్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కు ఒక లేఖ పంపింది. అందులో నగదు విత్‌ డ్రాయెల్స్‌ పై ఖాతాదారులు చెల్లించే ఇంటర్‌ ఛేంజ్ ఫీజును పెంచాలని ఆపరేట్లు కేంద్ర బ్యాంక్‌ ని ఆశ్రయించారు. లేకుంటే వారి వ్యాపారాలు దెబ్బతింటాయని వారు ఆ లేఖలో తెలిపారు.

 

 

నిజానికి ఇప్పటికే రిజర్వు బ్యాంక్ ఇటీవలే ఏటీఎంల సెక్యూరిటీ, మెయింటెనెన్స్ లాంటి షరతులను కఠినతరం చేసిన విషయం అందరికి తెలిసిందే. కాకపోతే ఇందులో కొన్ని కొత్త ప్రమాణాలను కూడా తీసుకువచ్చింది ఆర్‌బీఐ. దీనితో ఆపరేటర్లకు ఏటీఎం నిర్వహణ కొంతవరకు భారమైందని చెప్పవచ్చు. ఈ విషయానికి గాను ఇంటర్‌ ఛేంజ్ ఫీజును పెంచాలని ఆపరేటర్లు లేఖ రాశారు. అయితే ఆర్‌బీఐ కూడా వీరి లేఖకి  సానుకూలముంగా స్పందించే అవకాశముందని నిపుణులు తెలుపుతున్నారు.

 

 


నిజానికి మన భారతదేశంలో ఏటీఎంల విస్తరణ కాస్త చాలా తక్కువగానే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం కొత్త ఏటీఎంల విషయమేమో గాని, ఉన్న ఏటీఎంలను కొన్నిటిని అయితే మూసివేతకు సిద్ధంగా అలాగే చాలా చోట్ల ఏటీఎంలు కూడా సరిగా పనిచేయవు. ఇలాంటి పరిస్థితులలో ఏటీఎం ఆపరేట్లు కూడా వీటిపై చేతులెత్తేస్తే ఇంకా ఈ పరిస్థితులు మరింత కఠినంగా మారొచ్చు. ఇందంతా ఇలా ఉండగా ప్రస్తుత చార్జీలు ఆర్‌బీఐ ప్రకారం చూస్తే ఇంటర్‌ఛేంజ్ ఫీజు లావాదేవీకి రూ.15గా వాసులు చేస్తోంది. అయితే ఇందులో మాత్రం ఒక కస్టమర్ కి ఐదు లావాదేవీలు మాత్రమే ఉచితంగా లభిస్తాయి. ఇప్పుడు ఏటీఎం ఆపరేటర్లు చేతులెత్తేస్తే బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు కూడా కొత్తగా ఏర్పాటు చేసే ఏటీఎంపై ప్రతికూల వాతావరణం ఏర్పడవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: