ఫ్యాన్సీ నెంబర్.. ఇప్పుడు వాహనదారులకు ఇదో పిచ్చిగా మారింది. ఎంత దర్జాగా కారు ఉందన్నదే కాదు.. అంత దర్జగా ఆ కారు నెంబర్ కూడా ఉండాలి..ఇదే వారి ఫిలాసఫీ.. దీనికితోడు.. లక్కీ నంబర్.. ఇదో సెంటిమెంట్.. ఈ సెంటి మెంట్ కోసం కొందరు ఎంత పనైనా చేస్తారు. కలిసొచ్చే నెంబర్ కోసం.. ఫ్యాన్సీ గా కనిపించే నెంబర్ కోసం కాస్త డబ్బు ఎక్కువ ఖర్చు చేయడం చూస్తూనే ఉన్నాం..

 

 

అందుకే రవాణా శాఖ కూడా ఈ ఫ్యాన్సీ నెంబర్లను వేలం వేసి జనం క్రేజ్ ను సొమ్ము చేసుకుంటుంది. అయితే.. ఈ నెంబర్ల పై ప్రేమ కొంత వరకూ ఓకే.. కానీ.. ఏకంగా లక్షల్లో ఈ నెంబర్ల కోసం ఖర్చు చేసేవారుంటారంటే నమ్మడం కాస్త కష్టమే.. జైపుర్‌కి చెందిన రాహుల్‌ తనేజ టైర్లకు పంక్చర్లు వేస్తూ, ఆటో నడుపుకునే స్థాయి నుంచి వచ్చి బిలియనీర్‌గా ఎదిగాడు. ఎక్కడైనా నంబర్‌ 1గా ఉండాలనేది అతని లక్ష్యం.

 

అందుకే తన కార్ నెంబర్ కూడా నెంబర్ వన్ కావాలనుకున్నాడు. ఇటీవల తాను కోటిన్నర పెట్టి కొన్న జాగ్వార్‌కు ఒకటో నెంబర్ కోసం ఏకంగా 16 లక్షలు ఖర్చు చేసి బిడ్ వేసి దక్కించుకున్నాడు. RJ 45 CG1 నంబర్‌ గెలుచుకున్నాడు. ఆయన ఇలా నెంబర్ కోసం లక్షలు ఖర్చు చేయడం ఇదే కొత్త కాదు..

 

 

తొమ్మిదేళ్లలో కారు నంబర్ల కోసం దాదాపు 40 లక్షలకు పైనే ఖర్చు చేశాడట. 2011లోనే బీఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్‌ కొనుగోలు చేసి దానికి పదిన్నర లక్షలు చెల్లించి RJ14CP1 తీసుకున్నాడు. ఆ తరవాత దాన్ని మార్చి కొత్త కారును కొన్నా.. మళ్లీ బిడ్‌ వేసి పాత నంబర్‌నే దక్కించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: