మహాత్మాగాంధీ.. మన జాతి పిత.. భారత దేశ స్వాతంత్ర్యం కోసం దశాబ్దాల తరబడి పోరాడిన పోరాట యోధుడు. అది కూడా ప్రపంచమే మెచ్చిన అహింసా మార్గంలో ఆయన పోరాటం సాగింది. ఇన్నాళ్లూ భారత దేశం ఇంత ఐక్యం.. ప్రగతి పథంలో ఉందంటే అందుకు ఆయన వేసిన నైతిక పునాదులే కారణంగా చెప్పాలి.

 

 

అయితే ఆయన దేశం కోసం దాదాపు నాలుగున్న ర దశాబ్దాలు పోరాడితే.. ఆయన స్వతంత్ర్య భారతదాన్ని 40 నెలలు కూడా చూడలేదు. భారత దాస్య శృంఖలాలు తెగిన పడిన ఆరు నెలల్లోపే ఆయన్ను ఓ ఉన్మాది పొట్టన పెట్టుకున్నాడు. గాంధీ హత్యపై ఇప్పటికీ ఎన్నో వాదనలు ఉన్నాయి. గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేను హీరోలుగా భావించే మహానుభావులూ ఉన్నారు.

 

 

అయితే ఇప్పుడు మళ్లీ గాంధీ హత్య కేసును పునర్విచారణ చేయాలంటున్నారు కేంద్ర మాజీ మంత్రి, బిజెపి ఎమ్.పి సుబ్రహ్మణ్య స్వామి. మహాత్మాగాంధీ హత్య కేసును రీ-ఓపెన్ చేయాలని సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్య చేశారు. గాంధీజీ హత్యపై స్వామి వరుస ప్రశ్నలు సంధించారు. గాంధీ మృతదేహానికి ఎందుకు పోస్టుమార్టమ్ నిర్వహించలేదని సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్నించారు.

 

 

గాంధీ హత్యకు ప్రత్యక్ష సాక్షులైన అభా, మనులను కోర్టులో ఎందుకు విచారించలేదని సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్నిస్తున్నారు. నాధూరామ్ గాడ్సే కాల్చిన రివాల్వర్‌‌ను ఇప్పటివరకు ఎందుకు పట్టుకోలేకపోయారని సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్నించారు. అందుకే ఈ కేసును రీఓపెన్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ఎప్పుడూ ఏదో ఒక కలకలం సృష్టించే ఈయన ఇప్పుడు మళ్లీ గాంధీ హత్య కేసుపై పడ్డాడేంటా అని నెటిజన్లు విస్తుపోతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: