గెలుపు వాకిట్లోకి వచ్చి బొక్కబోర్లా పడితే ఎంత కష్టంగా ఉంటుందో సీఎం జగన్‌కు బాగా తెలుసు. 2012లో ఓ వేవ్‌లో వచ్చి ఏపీలో ప్రభంజనం సృష్టించిన జగన్ వైసీపీ...2014 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా చంద్రబాబు అనుభవం ముందు జగన్ ఓటమి పాలయ్యారు. ఇక ఈ ఓటమి దెబ్బకు జగన్‌లో పూర్తిగా మార్పు వచ్చింది. తర్వాత ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోవాలన్న వ్యూహాత్మకంగానే ముందుకెళ్లారు.

 

ముఖ్యంగా 2019 ఎన్నికల ముందు అధికార టీడీపీని దెబ్బతీసేందుకు రాజకీయ గేమ్ ఛేంజర్‌గా పేరున్న ప్రశాంత్ కిషోర్‌ని వ్యూహకర్తగా నియమించుకుని అదిరిపోయే రేంజ్‌లో విజయం సాధించి తొలిసారి సీఎం పీఠం అధిరోహించారు. అయితే ఎన్నికల్లో గెలిచాక పీకే టీం సైడ్ అయిపోయింది. ఇక అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగనే ఓ వైపు పాలన సవ్యంగా నడుపుతూ, మరోవైపు 40 సంవత్సరాల ఇండస్ట్రీ చంద్రబాబు వ్యూహాలకు చెక్ పెడుతూ దూసుకెళుతున్నారు.

 

ఎప్పటికప్పుడు బాబు రాజకీయ డ్రామా మొదలుపెడితే, ఆ డ్రామాల మాయలో ప్రజలు పడకుండా జగన్ అద్భుతమైన సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. దాని వల్ల ప్రజలు ఇంకా జగన్‌కు అనుకూలంగా వస్తున్నారు. ఇటీవల కూడా బాబు మూడు రాజధానులపై రచ్చ చేస్తుంటే, ముందు అనుకున్న విధంగా జగన్ అమ్మఒడి లాంటి గేమ్ ఛేంజర్‌ని తీసుకొచ్చి టీడీపీకు చెక్ పెట్టారు. అయితే స్థానిక సమరం మొదలు కానున్న నేపథ్యంలో చంద్రబాబు రాష్ట్రమంతా తిరగడానికి సిద్ధమయ్యారు.

 

ఈ నెల 19 నుంచి ప్రజా చైతన్య యాత్ర పేరుతో నియోజకవర్గాల్లో తిరిగి, స్థానిక ఎన్నికల్లో లబ్ది పొందాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కరెక్ట్‌గా ఇదే సమయంలో  ‘జగనన్న వసతి దీవెన’ పేరుతో జగన్ మరో పథకంతో ముందుకొస్తున్నారు.  అది కూడా రాష్ట్ర భవిష్యత్‌కు ఉపయోగపడే విద్యార్ధుల కోసం. రాష్ట్రంలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. ఫిబ్రవరిలో రూ.10 వేలు, జూలైలో రూ.10 వేలు వంతున విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. ఇక ఈ పథకం ప్రభావం ఆ విద్యార్ధి కుటుంబం మొత్తంపై ఉంటుంది. దీని వల్ల ఆ కుటుంబం జగన్‌కు అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది. మొత్తానికి స్థానిక సమరం ముందు జగన్‌కు ‘వసతి దీవెన’ బాగా కలిసిరానుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: