ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ విజయం.. పీఎం నుంచి సీఎం వరకు ఆయన వేసే వ్యూహాలకు ఫిదా కావాల్సింది.  ఆయన వ్యూహకర్తగా పనిచేసినా.. ఆయన సూచనలు పాటించి విజయం సాధించడం పక్కా... చాలా తక్కువ సార్లు లెక్కలు తప్పినా... ప్రధాని పీఠంపై నరేంద్ర మోడీ కూర్చోవడం నుంచి.. ఏపిలో జగన్.. రీసెంట్ గా ఢిల్లీ పీఠం ఎక్కిన కేజ్రీవాల్ వరకు ఆయన మాటను.. ఆలోచనను ఫాలో అయ్యారు.. పదవులు దక్కించుకున్నారు.  ఇప్పటికే ఆయన ఎవరో మీకు అర్థం అయ్యే ఉంటుంది. ఎన్నికల వ్యూహకర్తగా పిలుచుకునే ప్రశాంత్ కిషోర్.  ఏపీలో వైసీపీ తిరుగులేని విజయం సాధించడంలోనూ ఆయనదే కీలక పాత్ర.. ఇక, ఆయన పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు... వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఈ ఎన్నికలను దీదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

 

ఆయన ప్రస్తుతం తృణమూల్ కు సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించాలని మమత సర్కారు నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర సచివాలయం వర్గాలు వెల్లడించాయి. గత కొంత కాలంగా పీకే బాధితుల నుంచి పెను ప్రమాదం పొంచి ఉందని ఇంటిలీజెన్స్ వర్గాలు తెలియజేయడంతో ఆయనకు పూర్తి భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది.  

 

ఇక, ప్రత్యర్థుల నుంచి పీకేకు ప్రమాదం పొంచి ఉందన్న సమాచారంతో.. పశ్చిమ బెంగాల్ సర్కార్ ఆయనకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీని కేటాయిస్తుందట.. ఇద్దరు వ్యక్తిగత భద్రత సిబ్బంది, ఒక ఎస్కాట్, హౌజ్ గార్డ్ సహా అవసరాన్ని బట్టి స్థానిక పోలీసులు కూడా ప్రశాంత్ కిషోర్‌కు భద్రత కల్పించనున్నారు. మరోవైపు ప్రభుత్వ సొమ్ముతో ప్రశాంత్ కిశోర్ కు భద్రతను ఎలా కల్పిస్తారని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. మమతా బెనర్జీ కేవలం స్వప్రయోజనాలను మాత్రమే చూసుకుంటున్నారని సీపీఎం నేత సుజన్ చక్రవర్తి మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: