ఈ మద్య దేశంలో టిక్ టాక్ సందడి ఎక్కువైంది.  ఎక్కుడ చూసినా టిక్ టాక్ తో తెగ హల్ చల్ చేస్తున్నారు.  చిన్న పెద్దా అనే తేడా లేకుండా ఎవరు పడితే వారు టిక్ టాక్ లతో ఊదరగొడుతున్నారు.  ఈ టిక్ టాక్ గోల సిటీల్లోనే కాదు చిన్న చిన్న పల్లెటూళ్లకు కూడా పాకిపోయింది.  అయితే టిక్ టాక్ ఫన్నీ కోసం చేస్తే పరవాలేదు.. కానీ ఈ మద్య ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.  ఎత్తు మీద నుంచి దూకి టిక్ టాక్ చేయడం.. నీళ్లలో పడి టిక్ టాక్ చేయడం.. బైక్, మోటర్ వెహికిల్స్ ఇలా రక రకాల ఫీట్స్ తో టిక్ టాక్ చేస్తు కొంత మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.  కామెడీ అయితే పరవాలేదు.. కానీ ప్రాణాలు పోతే కుటుంబ సభ్యులు పడే ఆవేదన దారుణంగా ఉంటుందని ఎంత మంది హెచ్చరించినా తమ పని తాము కానిచ్చేస్తున్నారు. 

 

ఎవ్వరూ చేయని ఫీట్ చేయాలి..అందరితోను లైక్స్ కొట్టించుకోవాలి. ఫాలోవర్స్ ను పెంచుకోవాలి. అందరి దృష్టిని ఆకర్షించాలి. వీడెవడోగానీ..భలే చేశాడ్రా..అనిపించుకోవాలి..ఈ పిచ్చితో కొంతమంది యువత చేసే పిచ్చిపనులు ప్రాణాలమీదికి తెస్తున్నాయి.  తాజాగా ఓ యువకుడు రైలు ఫుట్ బోర్డ్ పట్టుకొని వ్రేలాడుతూ.. పట్టు తప్పి పడిపోయాడు.. అయితే అతను బతికి ఉన్నాడా.. లేడా అన్న విషయం ఇంకా సస్పెన్స్.  ట్రైన్ మాంచీ స్పీడ్ లో వెళుతోంది.

 

సదరు యువకుడు  ట్రైన్ డోర్ దగ్గర గాల్లో తేలిపోవాలని..రన్నింగ్ ట్రైన్ ఐరన్ రాడ్ పట్టుకుని పుట్ బోర్డ్ పై నిలబడి స్టంట్ చేద్దామని అతని ప్లాన్.  కానీ అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి.  తాను పట్టుకున్న ఫుట్ బోర్డ్ జారిపోయింది..మళ్లీ లేచి ట్రైన్ ఎక్కుదామనుకున్నాడు. కానీ సాధ్యంకాలేదు. ఆ తరువాత ఏమైందో  రైల్వే శాఖ  అన్నవిషయం వారికి కూడా తెలియదు. మొత్తానికి ఈ ఫీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: