ఆడదంటే మగాడికి ఈరోజుల్లో కూడా చులకన భావనే. ఒంటరిగా రాత్రి వేళ ఆడది కనిపించిందంటే చాలు.. ఎలా చెరబట్టాలా అని చూసే వాళ్లే ఎక్కువ. అలాంటింది.. దిశ చట్టం ఏపీలో మహిళల వైఖరిలో మార్పు తెస్తోంది. ఈ చట్టం అమల్లోకి రాకముందే మహిళల్లో ఆత్మస్థైర్యం నింపుతోంది. ఈ యాప్ వేసుకుంటే.. గట్టిగా ఫోన్ ఊపితే చాలు.. పది నిమిషాల్లో అక్కడకి పోలీసులు చేరుకుంటారు.

 

మొన్నటికి మొన్న అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఓ మారుమూల ప్రాంతంలో ఓ గిరిజన జాతరకు హాజరైన ఓ యువతిని ఓ యువకుడు అర్థరాత్రి వేళ చేయిపట్టుకుని చెట్లలోకి లాక్కెళ్లబోయాడు.. అమ్మాయి వెంటనే దిశ యాప్ తో మెస్సేజ్ పంపింది. పదినిమిషాల్లోనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేశారు.

 

ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. అందుే దిశ చట్టం మహిళల్లో ఆత్మస్థైర్యం నింపిందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న ఉమెన్స్‌ స్టడీ సెంటర్ల విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమానికి వాసిరెడ్డి పద్మ, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

 

వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. మహిళల భద్రతపై దేశానికి మార్గం చూపించేలా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దిశ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. మహిళలపై నేరాలు పాల్పడిన క్రూర మృగాలు ఏళ్ల తరబడి శిక్షలను తప్పించుకుంటూ చట్టాలకే సవాళ్లు విసిరే పరిస్థితి ఉందన్నారు. అలాంటి పరిస్థితులను రూపుమాపి 21 రోజుల్లో శిక్ష పడే విధంగా దిశ చట్టాన్ని తయారు చేసి దాని అమలు కోసం కృషి చేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌ను మహిళా లోకం కృతజ్ఞతలు తెలుపుతుందన్నారు. ఏదైనా ఈ రోజుల్లో దిశ వంటి చట్టం ఉండాల్సిందే. మృగాళ్ల అరాచకాలకు అడ్డుకట్ట పడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: