మీడియాని టీడీపీ అధినేత చంద్రబాబు ఏ రేంజ్‌లో వాడుతారో అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు మీడియాని వాడుకున్నంతగా సీఎం జగన్‌కు వాడుకోవడం చాలా తక్కువ అనే చెప్పొచ్చు. అసలు జగన్ మీడియా ముందు మాట్లాడటమే చాలా తక్కువ. ఏదో ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ కాస్త కనిపించారు గానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అయితే అసలు కనిపించడం లేదు. అధికార పీఠం ఎక్కిన దగ్గర నుంచి సైలెంట్‌గా ఆయన పని ఆయన చేసుకుని వెళ్లిపోతున్నారు తప్ప, ప్రతిపక్ష టీడీపీ మీడియా వేదికగా ఎలాంటి విమర్శలు చేస్తున్న పట్టించుకోవడం లేదు.

 

కాకపోతే తన పార్టీ నేతలతో కౌంటర్లు ఇప్పిస్తున్నారు తప్ప, జగన్ మాత్రం చంద్రబాబు మాదిరిగా ప్రతిదానికి మీడియా ముందుకొచ్చి చెప్పడం లేదు. అసలు ఆయన సీఎం అయ్యాక ఒక్కసారి కూడా మీడియా మీట్ పెట్టలేదు. కానీ ఆయన రెండు చోట్ల మాత్రం నోరు విప్పి టీడీపీకి కౌంటర్లు ఇస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కాస్త గట్టిగానే టీడీపీపై ఫైర్ అవుతున్నారు. అయితే అది ఎక్కువ సమయం కాదు. తాను ప్రజల కోసం చేసే కార్యక్రమాలని ఎక్కువ హైలైట్ చేసుకుంటూ వెళుతూ, టీడీపీని అప్పుడప్పుడు విమర్శిస్తున్నారు.

 

ఇక అసెంబ్లీలో తర్వాత ఏదైనా పథకాల ప్రారంభ సభల్లో మాట్లాడుతున్నారు. అక్కడ కూడా పథకం యొక్క ఉపయోగాలు, ఇంకా ప్రజల కోసం తాను ఏం చేస్తున్నానో అనే విషయం వివరిస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలపై నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తూ, మంచి పనులకు అడ్డు పడవద్దంటూ చెబుతున్నారు. అయితే ఈ విధంగా జగన్ అవసరమైన చోటే మాట్లాడటం వల్ల, చాలా బెన్‌ఫిట్ ఉంటుందనే చెప్పుకోవచ్చు.

 

ప్రతిదానికి మీడియాకు ఎక్కి మాట్లాడటం వల్ల ప్రజలకు విరక్తి వచ్చేస్తుంది. ఇప్పుడు చంద్రబాబు మీద ఎలా వచ్చిందో అలా. మీడియా సమావేశాలు చూడటానికి జనాలు ఆసక్తి చూపించారు. అదే అసెంబ్లీ సమావేశాలు, ప్రజా సభలు అయితే ఆసక్తికరంగా పట్టించుకుంటారు. అప్పుడు చెబుతూనే ప్రజలకు కూడా బాగా రీచ్ అవుతాయి. మొత్తానికైతే జగన్‌కు మాట్లాడటం తక్కువ మేటర్ ఎక్కువ అనే చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: