ఈ మద్య కొంత మంది చిత్రవిచిత్రమై పనులు చేస్తూ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు. అయితే వీరు చేస్తుపను ల వల్ల పోలీసులు మాత్రం చాలా కంగారు పడుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి  ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు కాసేపటి తర్వాత తల్లికి మెసేజ్ పెట్టారు. తాము చనిపోతున్నామని, వెతకొద్దని మెసేజ్‌లో చెప్పారు.  దాంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ద్వారకా నగర్‌లో నివాసముండే ఎర్రన్నాయుడు, లక్ష్మి దంపతులకు ముగ్గురు అమ్మాయిలున్నారు. ఈ ముగ్గురు అమ్మాయిలు  ‘ అమ్మా మేం చనిపోతున్నాం. మాకోసం వెతకొద్దు.నాన్నను జాగ్రత్తగా చూసుకో’ అంటూ మెసేజ్‌లో పెట్టి కనిపించకుండా పోయారు.

 

 కంగారుపడిన లక్ష్మి భర్తకు సమాచారమిచ్చింది. వారు చుట్టుపక్కల స్నేహితులు, బంధువులు ఇళ్లల్లో గాలించినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో యువతుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  యువతుల ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు మూడు స్పెషల్‌ టీమ్స్ ఏర్పాటు చేశారు. కనిపించకుండా పోయిన ఆ ముగ్గురు అమ్మాయిలు తాము చెన్నైలో ఉన్నామని మెసేజ్ పెట్టడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేశారు. దాంతో అమ్మాయిల తల్లిదండ్రులు కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ, వారు చెన్నై ఎందుకు వెళ్లారు? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో పోలీసులు ఆ ముగ్గురు బాలికలు బెంగుళూర్ లో ఉన్నట్లు కనుగొని పట్టుకున్నారు. వారు విశాఖపట్నం నుంచి చెన్నైకి ఓ ప్రైవేట్‌ బస్సులో వెళ్లినట్లు గుర్తించారు. అక్కడ ఒకరోజు ఉండి, బెంగళూరుకు వెళ్లినట్లు తేల్చారు.  వారిని బెంగళూరులో పట్టుకుని, విశాఖపట్నానికి తీసుకొస్తున్నారు. తమసోదరికి ఇష్టం లేని వివాహం చేస్తున్నారన్న కారణంతోనే అక్కాచెల్లెళ్లు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.  ఏది ఏమైనా ఇలాంటి వ్యవహారాల వల్ల అటు తల్లితండ్రులకు, ఇటు పోలీసులను టెన్షన్ పెట్టడం మంచి కాదని వారికి హితవు పలికారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: