ఆన్లైన్ షాపింగ్ లకు మెయిన్ గా వినపడే పేరు అమెజాన్.. రోజులో కొన్ని మిలియన్ ప్రొడక్టులను ఆన్లైన్ ద్వారా కస్టమర్లకు చేరవేస్తుంది. అలాంటి ఈ అమెజాన్ లో ప్రోడక్ట్ కూడా నాణ్యత కలిగి ఉండటంతో ఎక్కువ మంది కస్టమర్లు అమెజాన్ లో కొనడానికి మక్కువ చూపిస్తారు. ఇకపోతే ఈ అమెజాన్ కె కొందరు యువతులు చుక్కలు చూపించారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

 

 

వివరాల్లోకి వెళితే.. అమెజాన్ ఇండియానే బోల్తా కొట్టించాడో యువకుడు. విలువైన వస్తువులను ఆర్డర్ చేసి ఆ తర్వాత వివిధ కారణాలతో వాటిని తిప్పి పంపేవాడు. అయితే, అలా పంపినవి నకిలీవని తేలడంతో అమెజాన్ విస్తుపోయింది. మోసం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాలలో చోటు చేసుకుంది. 
 

 

 

జగిత్యాల నగరానికి  చెందిన అరుణ్.. అమెజాన్ సైట్ ద్వారా విలువైన వస్తువులను కొనుగోలు చేసేవాడు. ఆ తర్వాత వివిధ కారణాలు చూపి అసలు వస్తువులను తన వద్ద ఉంచుకుని నకిలీలను రిటర్న్ చేసేవాడు. ఇలా మొత్తంగా రూ.8 లక్షల విలువైన వస్తువులు కొనుగోలు చేసి నకిలీ వస్తువులను తిప్పి పంపాడు. 

 


అలా చాలా సార్లు అతను చేయడంతో  అనుమానించిన అమెజాన్ వెనక్కు వచ్చిన వాటిని పరిశీలించడంతో మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో అమెజాన్ లీగల్ టీం అరుణ్‌పై జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతను ఇంతవరకు అమెజాన్ నుండి ఎన్ని వస్తువులు దాచుకున్నాడో అవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతను ఇంతవరకు అమెజాన్ నుండి ఎన్ని వస్తువులు దాచుకున్నాడో అవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై చీటింగ్ కేసును కూడా అమెజాన్ ఫిర్యాదులో పేర్కొనడంతో అతన్ని పై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: