మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే మాటను మనం తరచూ వింటూ ఉంటాం. వైద్యులు కూడా మద్యం తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతూ ఉంటారు. మద్యం తాగడం వలన ఆయుష్షు తగ్గిపోవడంతో పాటు శరీరంలోని అవయవాలు కూడా పాడైపోతాయి. కానీ నెదర్లాండ్ సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో మాత్రం మద్యం తాగేవారు 90సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉందని తేలింది. 
 
నెదర్లాండ్ లోని మాస్ట్రిచ్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన పరిశోధనలలో మద్యపానం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్యానికి హానికరం కాదని తేలింది. మద్యం సేవించిన వారు ఎక్కువ రోజులు ఆరోగ్యంగా జీవించే అవకాశాలు ఉన్నాయని, 90 ఏళ్లు జీవించే అవకాశాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ఏజ్ అండ్ ఏజింగ్ జర్నల్ లో ఈ కథనం వచ్చింది. మాస్ట్రిచ్ యూనివర్సిటీ పరిశోధకులు 1916 - 1917 మధ్య పుట్టిన 5000 మంది పురుషులు మహిళలపై వారు 60 ఏళ్ల వయస్సులో ఉన్న సమయంలో మద్యపానం అలవాట్ల గురించి పరిశోధనలు చేశారు. 
 
ఈ పరిశోధనలో మద్యం తాగిన వారు 90 సంవత్సరాల వరకు జీవించినట్టు తేలింది. 5000 మందిపై మాస్ట్రిచ్ యూనివర్సిటీ పరిశోధకులు పరిశోధనలు చేయగా మద్యం తాగిన మహిళలు 34 శాతం మంది, మద్యం తాగిన పురుషులు 16 శాతం మంది 90 ఏళ్ల వరకు జీవించారు. జీవించిన వారంతా తక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నవారని పరిశోధకులు తేల్చారు. 
 
మాస్ట్రిచ్ పరిశోధకులు విపరీతంగా మద్యం తాగితే త్వరగా చనిపోతారని 15 గ్రాముల కన్నా తక్కువ ఆల్కహాల్ తాగిన వారు మాత్రం 90 ఏళ్ల వరకు జీవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. పరిశోధకులు లిమిటెడ్ గా మద్యం తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందని స్మాల్ డోస్ లో మద్యం తీసుకోవడం మంచిదే అని చెబుతున్నారు. పరిశోధకులు మందు తాగమని తాము చెప్పడం లేదని లిమిట్ లో ఉన్నంతవరకు మందు తాగినా ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: