హైదరాబాద్ హౌస్‌లో భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక చర్చలు కొనసాగాయి. పలు ఒప్పందాలపై మోదీ, ట్రంప్ సంతకాలు చేశారు. చర్చల అనంతరం ఇరువురూ మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడారు. ఈ చర్చల్లో వాణిజ్యంతోపాటు, రక్షణ ఒప్పందాలు ఉన్నాయ‌ని స‌మాచారం. అమెరికా డెయిరీ, పౌల్ట్రీ  కంపెనీలు భారత్‌లో దిగుమతులకు అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నాయి. ఇప్పటికే భారత్-అమెరికా మధ్య పన్నుల విషయంలో వివాదం ముద‌ర‌డంతో దీనిపై కూడా చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఇక ఈ చ‌ర్చ‌ల అనంత‌రం మోదీ - ట్రంప్ ప్రెస్‌మీట్ పెట్టారు. వాళ్లు ఏదైతే చెప్పాల‌నుకున్నారో అది మాత్ర‌మే సంక్షిప్తంగా చెప్పారు.  



- ఉమ్మ‌డి ప్రెస్‌మీట్ మోదీ ప్ర‌సంగం హైలెట్స్ :

- ట్రంప్ కుటుంబ స‌మేతంగా భార‌త్‌కు రావ‌డం ఆనందంగా ఉంది..
- గ‌త 8 నెల‌ల్లో ట్రంప్‌తో ఐదు సార్లు సమావేశ‌మ‌య్యాను..
- భార‌త్ - అమెరికా దౌత్య సంబంధాల్లో ర‌క్ష‌ణ రంగం కీల‌క‌మైంది..
- ఇంధ‌న స‌హ‌కారం గురించి ప్ర‌త్యేకంగా చ‌ర్చించాము..
- ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌, వాణిజ్య రంగాల్లో స‌హ‌కారంపై చ‌ర్చించాము..
- ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హించే శ‌క్తుల‌కు వ్య‌తిరేకంగా పోర‌డ‌తాము...
- భార‌త్ - అమెరికా స్నేహానికి ప్ర‌భుత్వాల‌తో సంబంధం లేదు..

ఉమ్మ‌డి ప్రెస్‌మీట్ ట్రంప్ ప్ర‌సంగం హైలెట్స్ :

- రెండు దేశాల‌కు ఇది ఉప‌యోగ‌క‌ర‌మైన ప‌ర్య‌ట‌న‌
- ఉగ్ర‌వాదంపై క‌లిసి పోరాటం చేస్తాం
- ఇస్లాం తీవ్ర‌వాదాన్ని అణిచివేస్తాం
- భార‌త్ - అమెరికా మ‌ధ్య మూడు ఒప్పందాల‌కు కుదిరాయి...
- స‌హ‌జ‌వాయు రంగంలో ఒప్పందం చేసుకున్నాం..
- ఈ జ్ఞాప‌కాలు ఎప్ప‌ట‌కీ మ‌రువ‌లేనివి..

ఇక భార‌త్ - అమెరికా మ‌ధ్య కుదిరిన ఒప్పందాలు ఇలా ఉన్నాయి...
1- రక్ష‌ణ రంగంలో 3 బిలియ‌న్ డాల‌ర్ల ఒప్పందం
2- ఇంధ‌న రంగంలో స‌హ‌కారంపై ఒప్పందం
3- ఉగ్ర‌వాదంపై ఉమ్మ‌డి పోరుకు నిర్ణ‌యం
4- భారీ వాణిజ్య ఒప్పందంపై చ‌ర్చ‌ల కొన‌సాగింపు
5- ఇండియ‌న్ ఆయిల్ - ఎక్సాన్ బి మొబిల్ మ‌ధ్య ఒప్పందం

మరింత సమాచారం తెలుసుకోండి: