ఈ మద్య మోసగాళ్లు బాగా తెలివి నేర్చుకున్నారు.  అవతలివాళ్ల బలహీనతలు క్యాష్ చేసుకుంటూ అందింనంత డబ్బు గుంజేస్తున్నారు.  టెక్నాలజీ పెరిగే కొద్ది కొంతమంది కేటుగాళ్లు తమ పని మరింత ఈజీగా కానిచ్చేస్తున్నారు.  ఇటీవల కాలంలో ఫోన్ కాల్స్ లో ఆడవారి గొంతుతో  మత్తెక్కించే మాటలతో.. చాలా మాందిని బురడీ కొట్టించారు.  తమ మద్య సాగిన సంభాషణలు రికార్డు చేసి అవతలి వారిని బెదిరించి డబ్బులు వసూళ్లు చేశారు.  తాజాగా ఓ మిమిక్రీ ఆర్టిస్ట్ అమ్మాయిలా గొంతుమార్చి ఏకంగా 350 మందిని మోసం చేసిన ఘటన చెన్నైలో జరిగింది. అయితే తాము దారుణంగా మోసపోయామని బాధితులు ఈ-మెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మెయిల్ ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేసి మోసగాన్ని అరెస్ట్ చేశారు.

 

వివరాల్లోకి వెళితే.. తిరునెల్వేలి జిల్లా పణుకుడికి చెందిన వళ్లల్ రాజ్‌కుమార్ మిమిక్రీ ఆర్టిస్ట్. అమ్మాయిలా గొంతుమార్చి అబ్బాయిలకు ఫోన్ చేసి వలపు వల విసిరేవాడు.. బాధితుల తన ట్రాప్ లో పడ్డారని గమనించిన తర్వాత చిన్నతా తన పథకాన్ని అమలు పరిచేవాడు. వాళ్లకు తన అందమైన గొంతుతో మత్తేక్కించే మాటలతో.. కవ్విస్తూ తనకు డబ్బు అవసరం ఉందని  డబ్బులు గుంజేవాడు. ఇలా ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా 350 మందిని మోసం చేశాడు. ఆ తర్వాత పత్తాలేకుండా పోయేవాడు. ఇలా ఆ మోసగాడి చేతిలో దారుణంగా మోసపోయామని గ్రహించిన యువకులు పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.

 

కాగా, తమకు  మైలాపూర్, కీల్ పాక్కం ప్రాంతాల నుంచి ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదులు అందినట్టు పోలీసులు తెలిపారు.  కేసు నమోదు చేసుకొని సిరియస్ గా ఎంక్వేయిరీ చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తే అమ్మాయిలా గొంతు మార్చుతున్న రాజ్‌కుమార్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో తమకు అడవారి గొంతుతో ఫోన్ కాల్స్ వస్తే జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: