ఢిల్లీలో జరిగిన రాళ్ల దాడిని కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు చేస్తున్నవారు పోలీసులపై రాళ్లు విసిరి శాంతి భద్రతల సమస్య సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటిస్తున్న సందర్భంలో ఇలాంటి దాడులు జరగడం.. భారత్ ప్రతిష్టను దెబ్బతీసేందుకేనని అన్నారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు చేస్తున్నవారు పోలీసులపై రాళ్లు విసిరి శాంతి భద్రతల సమస్య సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండు నెలలుగా షాహీన్‌బాగ్‌లో జాతీయ రహదారిని దిగ్భందించి ధర్నా చేస్తున్నా.. తాము ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు కిషన్ రెడ్డి.  హింసాత్మక ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఢిల్లీ పోలీసులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు.

 

కాగా, ఈశాన్య దిల్లీలోని జఫ్రాబాద్‌, మౌజ్‌పుర్‌, గోలక్‌పురి భజన్‌పురలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. ఆందోళన నేపథ్యంలో దిల్లీలోని జఫ్రాబాద్‌, మౌజ్‌పుర్‌-బాబర్‌ పుర్‌ మెట్రో స్టేషన్లను మెట్రో అధికారులు మూసివేశారు. 24 గంటల పాటు జఫ్రాబాద్‌ మెట్రో స్టేషన్‌ను మూసివేస్తున్నట్లు దిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ తెలిపింది.  ఏఏ వ్యతిరేక నిరసనలు ఢిల్లీలో హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.  దేశ వ్యాప్తంగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.

 

ఇదిలా ఉంటే.. ఈ ఘటనల వెనుక ఎవరున్నారో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాక్యలపై కాంగ్రెస్ నేతలు మండి పడుతన్నారు. తాజాగా కాంగ్రెస్ నేత, సినీ నటి ఖుష్బు సోషల్ మీడియాలో స్పందిస్తూ... దయచేసి ఎవరైనా ఈ మనిషికి చెప్పండి.... ఆ ఘటనల వెనుక ఉన్నది అమిత్ షా, నరేంద్ర మోదీ తప్ప ఇంకెవరు? ఈ విషయం అందరికీ తెలుసు అంటూ వ్యాఖ్యానించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: