గత ఏడాది ఏపిలో జరిగిన ఎన్నికల్లో టీడీపీపై వైసీపీ విజయఢంకా మోగించింది.  ఐదేళ్ల పరిపాలనకు ఏపి ప్రజలు విసిగి పోయారని.. అవినీతి పాలనతో ప్రజలు ఎంతో నష్టపోయారని.. అందుకే కొత్త ప్రభుత్వానికి ఆహ్వానం పలికారని వైసీపీ నేతలు అంటున్న విషయం తెలిసిందే.  ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలు తూ.చ. తప్పకుండా నెరవేర్చే పనిలో ఉన్నారు. గత పాలనలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలిందని.. చిన్న, పెద్దా పనికి ప్రజలను పీడించేవారని.. కానీ తన పాలనలో అవినీతి అన్న పదం వినిపించరాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.  ఎంతటి వారైనా.. చివరికి తన పార్టీ నేతలైనా అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హెచ్చరించారు.

 

అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తే డైరెక్ట్‌గా ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. దీనికి 14400 అనే టోల్‌ ఫ్రీ నంబర్‌ను కేటాయించారు.  కొత్తగా ఏర్పాటు చేయనున్న 14400 టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఇంటలిజెన్స్, ఏసీబీ అధికారులు స్వయంగా పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల అవినీతిపై ఫిర్యాదులు అందితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. 

 

ఈ నేపథ్యంలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఏపీ ప్రభుత్వం తరఫున ఓ వీడియో సందేశం అందించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవినీతి రహిత సమాజం కోసం ఎంతో కృషి చేస్తున్నారని, ఎవరైనా అవినీతికి పాల్పడితే 14400 అనే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని పీవీ సింధు సూచించారు.  ఎవరు అవినీతికి పాల్పడినా భయం లేకుండా మీ గొంతుక వినిపించండి అంటూ పిలుపునిచ్చారు.  ఏ ప్రభుత్వ శాఖలో అవినీతి లంచగొండి రాభందులు ఉన్నా.. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి డైల్ చేయండి చాలు అన్నారు. తాజాగా, దీనికి సంబంధించిన ప్రచార వీడియోలను జగన్ విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: