ఢిల్లీలో అల్లర్లు రోజు రోజుకు పెరిగిపోయిన సంగతి తెలిసిందే.  ఒక్క ఢిల్లీలోనే కాదు, సిఏఏ చట్టం అమలులోకి తీసుకొచ్చినప్పటి నుంచి అదే విధంగా అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి.  సిఏఏ వలన భారతీయ ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఎవరూ వినడం లేదు.  కొన్ని రకాల అరాచక శక్తులు దేశంలో అలజడులు సృష్టించేందుకు నడుం బిగించాయి.  


దాని వలనే ఇదంతా జరుగుతున్నది.  ఇప్పటికే ఈ అల్లర్ల కారణంగా ప్రభుత్వ ఆస్తులు ద్వంసం అయ్యాయి.  ప్రజలకు రక్షణ కరువైంది.  ఎటునుంచి ఎవరు వచ్చి దాడి చేస్తారో, ఇంట్లో ఉన్న మహిళపై  ఈ అల్లర్ల పేరుతో ఎక్కడ రేప్ చేస్తారో అని భయపడుతున్నారు.  ఢిల్లీలో కొందరు హిందువుల కుటుంబాలు ఇలానే భయపడుతున్నాయి.  ఇప్పటికి కూడా దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు.  


ఈ విషయంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నా ఇవి ఆగడం లేదు.  ట్రంప్ వచ్చిన రోజు నుంచి అల్లర్లు మరింతగా మొదలయ్యాయి.  ఢిల్లీలోని జఫ్రాబాద్ లో ఈ అల్లర్లు జరిగాయి.  రాళ్ళూ రువ్వారు, షాపులు తగలబెట్టారు.  నానా హంగామా చేశారు.  దేశరాజధానిలో భద్రత కరువైంది.  నిన్నటి రోజున ఈ ఉద్రిక్తత మరింత పెరిగిపోవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.  


కనిపిస్తే కాల్చివేత ఆర్డర్స్ పాస్ చేసింది.  ఇలా చేయడం వలన అల్లర్లను అదుపులోకి తీసుకురావొచ్చని పోలీసులు చెప్తున్నారు.  మాట విననపుడు  దండోపాయం తప్పదు.  అయితే, ఎంతకాలం ఈ దానోపాయం అన్నది తెలియాలి.  నాలుగైదు రోజులు కర్ఫ్యూలు విధిస్తారు.  మరి ఆ తరువాత ఏం చేస్తారు.  ఈరోజు ఢిల్లీలో కర్ఫ్యూ పెట్టారు.  రేపు యూపీలో అల్లర్లు జరుగుతాయి.  అప్పుడు పరిస్థితి ఏంటి? మరో చోట అల్లర్లు జరుగుతాయి.  అప్పుడేం చేయాలి. ప్రభుత్వం దీనికి శాశ్వత పరిష్కారం ఆలోచించాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: