ట్రంప్ రెండు రోజుల పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకొని అమెరికా తిరిగి వెళ్లిపోయారు.  అయితే, ట్రంప్ కొన్ని విషయాల్లో అతితెలివిని ప్రదర్శించి భారత్ ను ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేశారు. ఇండియాకు వచ్చిన తరువాత మొతేరా స్టేడియంలో సభను ఏర్పాటు చేశారు.  ఈసభలో ఇండియాతో ఉన్న బలమైన మైత్రి గురించి మాట్లాడుతూనే కొన్ని విషయాల్లో భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడటం బాధను కలిగించింది.  


భారత్ తో పాటుగా పాక్ విషయంలో కూడా తనకు సమానమైన సంబంధాలు ఉన్నాయని చెప్పడం వెనుక ఉద్దేశ్యం ఏంటి? ఇండియాతో ఒప్పందాలు ఉంటె ఉండొచ్చు.  కానీ, పాక్ తో సంబంధాలు ఒదులుకోలేము అని చెప్పడానికి అయన ఇలాంటి పనులు చేసి ఉంటారు.  దీనికి కారణం ఉన్నది.  అదేమంటే, అమెరికా నుంచి అత్యధికంగా ఆయుధాలు కొనుగోలు చేసే దేశాల్లో పాక్ ఒకటి.  


అందుకే పాక్ కు అమెరికా అలాంటి ప్రాధాన్యత ఇస్తోంది.  అమెరికా ఏ పని చేసినా అది బిజినెస్ వేలోనే చేస్తుంది కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు.  ఈ విషయంలో అమెరికా తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉంటాయి.  అసలు మొతేరా స్టేడియంలో పాక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.  కానీ, కావాలనే ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మనం అర్ధం చేసుకోవచ్చు.  ఇక మూడు బిలియన్ డాలర్ల మేర రక్షణ ఒప్పందాలు చేసుకున్న ట్రంప్, కొన్ని విషయాల్లో కప్పదాటుగా ఉండటం విశేషం.  


అందులో ముఖ్యంగా హెచ్ 1 బి వీసాల విషయంలో ట్రంప్ వ్యవహరించిన తీరు ఇండియాకు నచ్చలేదని చెప్పాలి.  గతంలో ఒబామా ప్రభుత్వం హెచ్ 1 బి వీసాల విషయంలో ఇండియాకు ప్రాధాన్యత ఇచ్చింది.  కానీ, ట్రంప్ ప్రభుత్వం మాత్రం హెచ్ 1 బి వీసాల విషయంలో ఇండియాపై ఉక్కుపాదం మోపడం విశేషం.  అంతేకాదు, ఇండియాకు ఇచ్చే రాయితీల విషయంలో కూడా ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు.  ట్రంప్ కేవలం తన అవసరాల కోసమే ఇండియాకు వచ్చారు తప్పించి ఇండియాకు ఏదో చేయాలి అని కాదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: