ఢిల్లీలో అల్లర్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  అల్లర్లను తగ్గుముఖం పట్టించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈశాన్య ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.  144 సెక్షన్ నెలరోజుల పాటు అమలులోకి తీసుకొచ్చారు.  దీంతో ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లోకి మారిపోయింది.  ఢిల్లీ అల్లర్ల వెనుక ఎవరున్నారు అనే కోణంలో ప్రభుత్వం ఆరా తీస్తోంది.  


ఇప్పటికే ఈ విషయంలో అన్నిరకాల చర్యలు తీసుకుంటున్న ఢిల్లీ ప్రభుత్వం కర్ఫ్యూ తరువాత కొంత ఊరట కలిగింది అనుకున్నారు.  కానీ, అంతలోనే మరోసంఘటన జరిగింది.  ఢిల్లీలో ఓ దుకాణంలో వివేక్ అనే వ్యక్తి పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే దుకాణం తెరిచి పనిచేసుకుంటున్న సమయంలో కొందరు దుకాణంలోకి దూరి వివేక్ పై దాడి చేశారు. డ్రిల్లింగ్ మెషిన్ తో దాడి చేయడంతో ఆ మెషిన్ వివేక్ తలలో గుచ్చుకుపోయింది.  


అక్కడే ఉన్న మిగతా వ్యక్తులు వివేక్ హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు.  దీనికి సంబంధించిన ఎక్స్ రే ను కూడా తీశారు.  డ్రిల్లింగ్ మెషిన్ తో దాడి చేయడంతో తలకు గాయం అయ్యింది.  దీనిపై పోలీసులు సీరియస్ అయ్యారు.  దాడులను ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నా ఇలాంటివి షరా మాములే అవుతున్నాయి.  అందుకే అల్లరి మూకపై ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది.  అల్లరి మూకను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ అవసరమైతే వారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధం అవుతున్నారు.  


షాహిన్ బాగ్ ఏరియాలో గొడవలు పెద్దగా జరగలేదు.  నిరసనలు మాత్రమే జరిగాయి.  కానీ, జఫ్రాబాద్, చాంద్ బాగ్ ఏరియాల విషయంలో దీనికి వ్యతిరేకంగా జరిగింది.  చాంద్ బాగ్ లో జరిగిన అల్లర్లలో ఇప్పటి వరకు దాదాపుగా 17 మంది మరణించగా అనేకమందికి గాయాలయ్యాయి.  ఆందోళనకారులు నిరసనలు ఆపకుంటే, ఈ మరణాల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.  భవిష్యత్తులో ఏమౌతుందో చూడాలి.  ఇంకా ఎలాంటి గొడవలు జరుగుతాయో తెలుసుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: